close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊరంతా పూలసాగు..!

ద్యానవనానికో పూలలోయకో వెళ్లినప్పుడు నిండుగా విరబూసిన పూలను చూసి మనసంతా పరవశమై తనువంతా పులకించిపోదూ. అలాంటిది నిద్ర లేచింది మొదలు... ఇంటి పెరట్లో పొలంలో వీధుల్లో మార్కెట్టులో... ఇలా ఎక్కడకు వెళ్లినా ఎటు చూసినా రంగురంగుల సుమ బాలలే పలకరిస్తుంటే ఆ హాయిని వర్ణించగలమా... వియత్నాంలోని మెకాంగ్‌ డెల్టాలో ఉన్న సా డెక్‌ గ్రామానికి వెళ్లిన వాళ్లకు కచ్చితంగా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే- అదో అందమైన పూల గ్రామం. ఆ ఊళ్లో ఎటు చూసినా పూల వనాలే. అయితే ఆ ఊరికి రెండు వైపులా నదులు ఉండటంతో తరచూ వరదలు వస్తుంటాయి. అందుకే పూలతోటలు మునిగిపోకుండా మంచెల్లా కట్టిన కర్రలమీద మట్టి కుండీల్నీ వెదురు బుట్టల్నీ పెట్టి వాటిల్లో మొక్కల్ని పెంచుతారు. వరదలు ముంచెత్తినప్పుడు పడవల్లో వెళ్లి ఆ పూలవనాల్లో పనులు చేస్తుంటారు సా డెక్‌ వాసులు. గత వందేళ్లుగా అక్కడున్న 600 హెక్టార్లలో దాదాపు 2,500 రకాల పూలని సాగుచేస్తున్నారట. అతి పెద్ద పూలగ్రామంగానూ పేరొందిన ఆ ఊరి నుంచే ప్రధాన నగరాలకీ విదేశాలకీ పువ్వుల్నీ మొక్కల్నీ కూడా సరఫరా చేస్తుంటారు. గాలి మేఘాలద్వారా ఆ పూల కబురు విన్న దేశ, విదేశీ పర్యటకులెందరో ఆ అందాల్నీ సుగంధాల్నీ ఆస్వాదించేందుకు రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయి, ఏ నందనవనంలోనో విహరిస్తోన్న అనుభూతిని పొందుతారట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు