close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అతితెలివి

ఒక భార్య భర్తకు మెసేజ్‌ చేసింది...
భార్య: వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. అలాగే సుమతి మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది.
భర్త: సుమతి ఎవరు?
భార్య: హహ్హహ్హ... సుమతీలేదు గిమతీ లేదు... మీరు మెసేజ్‌ చదివారో లేదోనని టెస్టు.
భర్త:నీమొహం. నిన్ను అడిగింది పక్కవీధి సుమతా, ఎదురువీధి సుమతా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు- నాలుగో వీధి సుమతీ నేనూ కూరగాయల మార్కెట్టు దగ్గర కలిసే ఉన్నాం.
భార్య: (కోపంగా) అక్కడే ఉండండి, నేను వస్తున్నా. పది నిమిషాల తరవాత...
భార్య: మార్కెట్టుకు వచ్చా, మీరిద్దరూ ఎక్కడున్నారు?
భర్త: హహ్హహ్హ... నేను ఆఫీసులో ఉన్నా... సుమతి ఎవరో నాకు తెలీదు. ఎలాగూ మార్కెట్టుదాకా వచ్చావుగా, కావల్సినవన్నీ కొనుక్కుని వెళ్లు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు