close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశి ఫలం

గ్రహబలం (సెప్టెంబరు 27 - అక్టోబరు 3)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

శుభ యోగాలున్నాయి. సంకల్పం సిద్ధిస్తుంది. ధనధాన్య లాభముంది. తిరుగులేని భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితముంటుంది. ఒక ప్రమాదం నుండి తృటిలో బయటపడతారు. మంచి వార్త వింటారు. గత వైభవం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మనశ్శాంతి ఉంటుంది.


ముఖ్యకార్యాల్లో జాగ్రత్త అవసరం. సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని చేరతారు. వ్యాపారంలో కలసి వస్తుంది. ఉద్యోగంలో లాభముంది. బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తారు. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆవేశ పూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. ఇష్టదైవాన్ని స్మరించండి. మేలు జరుగుతుంది.


శ్రమ ఫలిస్తుంది. ముఖ్యకార్యాల్లో శీఘ్రవిజయం లభిస్తుంది. కోరికలు నెరవేరతాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదృష్టం కలసివస్తుంది. ధనయోగం పరిపూర్ణంగా ఉంది. ఉద్యోగంలో శుభ ఫలితముంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలుంటాయి. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. శుభవార్త వింటారు. ఇష్టదేవతా స్మరణ మంచిది.


అదృష్టయోగముంది. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. ఆర్థికాంశాలు బాగున్నాయి. ఉద్యోగంలో కలసివస్తుంది. వ్యాపార యోగం విశేషంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలున్నాయి. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. ఎదురుచూస్తున్న కార్యం సఫలమవుతుంది. పలు మార్గాల్లో పైకి వస్తారు. ఇష్టదేవతారాధన కార్యసిద్ధినిస్తుంది.


పనులు పూర్తి అవుతాయి. అదృష్టవంతులు అవుతారు. ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. దైవాను గ్రహం సంపూర్ణంగా ఉంది. ఆపదలు దరిచేరవు. మిత్రుల సలహా పనిచేస్తుంది. ఉద్యోగరీత్యా శుభ ఫలితం లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వర ఆరాధన శాంతినిస్తుంది.


చాలా కష్టపడాల్సి ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఎవరినీ ప్రత్యక్షంగా విమర్శించవద్దు. ఉద్యోగంలో కలసివస్తుంది. గౌరవం పెరుగుతుంది. ధన యోగముంది. వ్యాపారం బాగుంటుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమ ఫలిస్తుంది. సత్ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. లక్ష్మీ ప్రార్థన శుభప్రదం.


అడుగడుగునా అవరోధాలుంటాయి. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. దగ్గరివారి సూచనలు తీసుకోవాలి. భయం వెంటాడుతుంది. ధైర్యంగా ఉండాలి. పట్టుదలగా పనిచేసి కష్టాలను అధిగమిస్తారు. ఆర్థికవిషయాల్లో జాగ్రత్త. భవిష్యత్తుకు తగిన నిర్ణయాలు తీసుకోండి. నవగ్రహ శ్లోక పఠనం మనశ్శాంతినిస్తుంది.


బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు శుభ పలితాన్నిస్తాయి. అన్నివిధాలా గొప్ప స్థితి కనపడుతోంది. ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. నిరంతరమైన కృషితో విశేష లాభాన్ని పొందుతారు. మనోభీష్టం నెరవేరుతుంది. ధర్మం రక్షిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. జీవితం కోరుకున్న విధంగా సాగుతుంది. గణపతిని ధ్యానించండి.


విజయం లభిస్తుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయండి. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. ఆర్థికంగా శుభ కాలం నడుస్తోంది. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది. సహనంతో ముందుకు సాగండి. సంతృప్తినిచ్చే ఫలితాలున్నాయి. నలుగురినీ కలుపుకుపోవాలి. అనుకున్నది సాధిస్తారు. ఇష్టదైవస్మరణ ఆనందాన్నిస్తుంది.


మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేనికీ తొందరవద్దు. ఉద్యోగంలో ఓర్పుతో సమాధానమివ్వాలి. కొన్ని విఘ్నాలు కలవరపెడతాయి. మనోబలంతో వాటిని ఎదుర్కొంటారు. వ్యాపార నష్టం రాకుండా శ్రద్ధ తీసుకోండి. దగ్గరివారితో విభేదాలు వద్దు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. శివధ్యానం శుభాన్నిస్తుంది.


అనుకున్న పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమంగా ఉంటుంది. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. పట్టు విడుపులతో లక్ష్యం నెరవేర్చుకుంటారు. స్వల్పంగా ఇబ్బందులున్నా పెద్ద సమస్యేమీ రాదు. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. పోయినవి తిరిగి లభిస్తాయి. శుభవార్త వింటారు. ఆంజనేయ స్వామిని స్మరించండి.


పనుల్లో విజయం ఉంటుంది. సరైన ప్రణాళిక ద్వారా అనుకున్నది సాధిస్తారు. శ్రేష్ఠమైన ఫలితాలు సిద్ధించే కాలమిది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. గృహ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారం కలసి వస్తుంది. లక్ష్యానికి దగ్గరలోనే ఉన్నారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వారాంతంలో మేలు కలుగుతుంది. సూర్య నమస్కారం రక్షణనిస్తుంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.