close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గ్రహబలం (ఆగస్టు 9 - 15)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


గౌరవ ప్రదమైన జీవితం లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితముంటుంది. మంచి భవిష్యత్తుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఇష్టకార్యాలు పూర్తి అవుతాయి. వివాదాలకు అవకాశముంది. తల్లి తరఫువారినుండి సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇష్టదైవస్మరణతో మేలు జరుగుతుంది. 


శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి. కొత్తగా ఆలోచిస్తారు. అవరోధాలున్నాయి. ఆర్థికంగా జాగ్రత్తపడాలి. ఒత్తిడిని తట్టుకుని పనిచేయాలి. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఆవేశం తగ్గించుకోవాలి. శ్రేష్ఠమైన భవిష్యత్తు లభిస్తుంది. వృత్తిలో మంచి జరుగుతుంది. శివారాధన మేలుచేస్తుంది.


బ్రహ్మాండమైన ఫలితాలుంటాయి. స్థిరమైన జీవితం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. శాంత చిత్తంతో సమస్యలని పరిష్కరించండి. బంధువుల వల్ల కలసి వస్తుంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంకల్పబలంతో అనుకున్నది దక్కుతుంది. భూ, గృహ లాభాలుంటాయి. లక్ష్మీ స్తోత్రం చదివితే మంచిది.


అనేక అవరోధాలు ఎదురవుతాయి. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశపూరిత వాతావరణం ఉంటుంది. మొహమాటంతో సమస్య జటిలమవుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు ఉపయోగపడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా ప్రార్థనతో శుభం జరుగుతుంది.


లక్ష్యాన్ని చేరతారు. మంచి ఫలితం లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. అదృష్టయోగం ఉంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారుంటారు. ఎవరినీ నమ్మే సమయం కాదు. సొంత నిర్ణయమే మంచిది. వారం మధ్యలో ఒక పని పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదేవతాస్మరణ మంచిది.


అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఇబ్బందుల నుండి బయటపడతారు. కార్యసిద్ధి ఉంటుంది. శ్రమ పెరిగినా ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో బాగుంది. బంధుమిత్రుల వల్ల కలసివస్తుంది. సంతోషప్రదంగా కాలం గడుస్తుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణలాభం సూచితం. ఇష్టదేవతారాధన ఉత్తమం.


శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన శుభ ఫలితాలున్నాయి. ఉద్యోగపరంగా అనుకూల సమయం. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. పనిలో సంతృప్తి లభిస్తుంది. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. వాహన, గృహయోగాలున్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఇష్టదైవ నామాన్ని స్మరించండి. శాంతి లభిస్తుంది. 


ఆర్థికంగా బాగుంటుంది. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. శ్రేష్ఠమైన భవిష్యత్తు లభిస్తుంది. స్థిమితంగా ఆలోచించాలి. సొంత నిర్ణయం మంచిది. ఉపద్రవాలనుంచి బయటపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఎదురుచూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇష్టదైవాన్ని దర్శించండి. మనశ్శాంతి లభిస్తుంది.


ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. ముఖ్యకార్యాల్లో తోడు అవసరం, సొంత నిర్ణయం వద్దు. ఉద్యోగంలో సమయానికి పనులు పూర్తిచేయండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆర్థికస్థితి అంత బాగా ఉండదు. రుణ సమస్యలుంటాయి. కుటుంబ సభ్యుల,  ఆత్మీయుల సలహాలు తీసుకుంటే ఉత్తమ ఫలితం వస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత చేకూరుతుంది. 


ముఖ్యమైన పనుల్లో స్పష్టతతో ఉండండి. అనుకున్నది జరుగుతుంది. అదృష్టవంతులవుతారు. సాహసోపేత నిర్ణయాలు పనిచేస్తాయి. సమష్టి కృషి ఫలిస్తుంది. ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు విజయాన్నిస్తాయి. ఉద్యోగవ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలకు అవకాశముంది. కొందరికి మీ వల్ల సహాయం అందుతుంది. ఇష్టదేవతను దర్శిస్తే ఒత్తిళ్లు తగ్గుతాయి.


అభీష్టసిద్ధి ఉంటుంది.  అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. ప్రతిభతో మెప్పిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది. వ్యాపారంలో కలసివస్తుంది. అన్నివిధాలుగా పైకి వస్తారు. మీవల్ల కుటుంబసభ్యులకు ఉపకారం జరుగుతుంది. ధనలాభం సూచితం. వాహన సౌఖ్యముంటుంది. క్రమంగా సుస్థిరత ఏర్పడుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానించడం మేలుచేస్తుంది.


శుభ యోగాలున్నాయి. అభీష్టసిద్ధి కలుగుతుంది. ఆశించిన జీవితం లభిస్తుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలున్నాయి. అపార్థాలకు తావివ్వకుండా స్పష్టమైన భావాలతో ముందుకుసాగాలి. అనుకున్నదే జరుగుతుంది. సుఖసంతోషాలుంటాయి. వారం మధ్యలో ఒక పని పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. శుభవార్త ఆనందాన్నిస్తుంది. సూర్యస్తుతి శక్తిని ఇస్తుంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.