close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా నేపథ్యంలో...

కరోనా వ్యాపిస్తున్న వేళ సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలను నేపథ్యంగా తీసుకుని మలచిన నవల ఇది. ముగ్గురు స్నేహితులు పక్కపక్కనే ఇళ్లు కట్టుకుంటారు. పిల్లలంతా పెద్దవాళ్లై వేర్వేరు చోట్ల స్థిరపడగా దగ్గర ఉన్నవారితో కలిసి, మనవలతో ఆడుకుంటూ ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ వృద్ధుల జీవితాల్లో వైరస్‌ తెచ్చిన మార్పులు ప్రధాన ఇతివృత్తం. విదేశాల్లో చదువుకుని అభిషేక్‌ అక్కడే స్థిరపడిపోతే అతడి భార్య జాహ్నవి అత్తమామల్ని కనిపెట్టుకుని ఉంటుంది. ఇక్కడ ఉంటే పెద్దలకు సేవలు చేయాల్సి వస్తుందని డాక్టరైన భర్త యశ్వంత్‌తో విదేశాలకు వెళ్లిపోతుంది స్నేహ. మరోపక్క ఉన్నతాధికారులుగా జగదీష్‌, సునందలు సేవాభావంతో మంచి పేరు తెచ్చుకుంటారు. జగదీష్‌ భార్య శిరీషకి మాత్రం మంచీ మర్యాదా ఏమీ పట్టదు. అలాంటివారి మధ్య కరోనా వల్ల చెలరేగిన కల్లోలం ఎవరెవరిని ఎలా మార్చిందో చెబుతుందీ నవల.

-శ్రీ

 

కరోనా శాపమా? వరమా?(నవల)
రచన: పుప్పాల సూర్యకుమారి
పేజీలు: 182; వెల: 100/-
ప్రతులకు: ఫోన్‌-9391113756


తాత్విక అభివ్యక్తి

గత ఇరవై ఏళ్లలో సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలపై కవి స్పందనను తెలియజేస్తుంది ఈ సమగ్ర కవిత్వం. తాత్విక ధోరణితో ఆయా పరిణామాలను విభిన్నంగా చూడడంతో వ్యక్తీకరణ ఆలోచింపజేసేదిగా ఉంది. నీ చరిత్ర సమాధిని తోడితే/అగుపడేది వట్టి ఎముకల గూడు/ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ/ నువ్వొక ప్రేమ కరువైన బీడు... అంటారు కవి ప్రేమికుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రాసిన కవితలో. ప్రశాంతంగా బతకడంతెలియని మనుషులకు స్మశానంలోనే శాశ్వత శాంతి అనే కవి- అలజడి రేపిన జీవనపయనంలో/ అలసి, సొలసిన ఆలోచనలను/ తట్టిలేపి... అలికిడి లేని పరమాద్భుతప్రకంపనాలతో/ మూసుకుపోయిన అంతర్లోకాలకు/ దారుల్ని తెరిచే/ నిశ్శబ్ద ప్రపంచం- స్మశానం... అని తేల్చేస్తారు.

- సుశీల

మునిమడుగుల రాజారావు సమగ్ర కవిత్వం
పేజీలు: 224: వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 9848787284


జీవిత సత్యాలు

మన చుట్టూ సమాజంలో కన్పించే మనుషులూ,వారి మనస్తత్వాలూ,ఎదుర్కొంటున్న రకరకాల ఒత్తిళ్లూ, జరుగుతున్న నేరాలూ... ఇలాంటివన్నీ ఈ కథల్లో కన్పిస్తాయి. చెడుతిరుగుళ్లు తిరుగుతున్నందుకు అమ్మ ఇంట్లోంచి గెంటేసిందని కోపం వచ్చి ఎటోవెళ్లిపోయిన అతడు తప్పు తెలుసుకుని తిరిగివస్తే ఎలాంటి అనుభవంఎదురైందో చెప్పే కథ ‘అమ్మ’. చాటింగ్‌ పేరుతో తీపికబుర్ల మాయలో పడి మోసపోయిన ఓ మహిళ తనలాగా కాకుండా కొందరినైనా కాపాడాలని వారికి ‘రహస్య స్నేహితుడు’ అవుతుంది. అదే చాటింగ్‌ పేరుతో అమాయకులకు వలవేసే నేరగాళ్లను పట్టుకుని శిక్షించడం ‘అంతర్జాల మాయ’లో కనిపిస్తుంది. కథలన్నీ జీవితసత్యాలను భిన్నకోణాల్లో ఆవిష్కరిస్తాయి.

- పద్మ

 

అంకితం (కథలు)
రచన: ఉండవిల్లి.ఎమ్‌
పేజీలు: 118; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 9441347679


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.