close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంచితనం కథలు

సముద్రం అంటేనే ఉప్పునీరు. అలాంటిది ‘మంచినీటి సముద్రం’ అని ఈ కథలకు పేరు పెట్టిన రచయిత సముద్రమంత మంచి మనసున్న పాత్రల్ని కథల్లో మనకు పరిచయం చేశారు. ‘మంచినీటి సముద్రం’లో ఒక అత్త కోడల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడి ఆమెకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి అత్తింట్లో నరకం చూపిస్తున్నట్లు తెలిసి ఓ తండ్రి అల్లుడికి చెప్పిన గుణపాఠమే ‘కనిపించని తెరలు’. వయసు మళ్లిన తమని ఇంట్లో పెట్టుకుని మరీ నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలను ఏమీ అనలేని తల్లిదండ్రులు అందరూ కలిసి పిల్లలకు దగ్గరగా ఉంటూనే తాము సంతోషంగా ఉండే మార్గాన్ని వెతుక్కున్నారు. అదేమిటో చెబుతుంది ‘పన్నీట పయనం’. ఎడారి మొలక, నేల మీది నక్షత్రాలు లాంటి శీర్షికలు ఆకట్టుకుంటాయి. హాయిగా చదివించే ఈ కథలన్నీ నేటి సమాజం ఎదుర్కొంటున్న ఏదో ఒక సమస్యని చర్చిస్తాయి.  - శ్రీ

మంచినీటి సముద్రం(కథలు)
రచన: వడలి రాధాకృష్ణ
పేజీలు: 160; వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


చారిత్రక కల్పన

చారిత్రక వాతావరణం నేపథ్యంగా తీసుకుని మలచిన కాల్పనిక నవల దివ్యా. కథానాయిక అగ్రకులానికి చెందిన యువతి. శూద్రుడైన పృథుసేనుడిని ప్రేమిస్తుంది. పాలకులు విలాసాలలో మునిగి
తేలుతూండగా యుద్ధం ముంచుకువస్తుంది. పృథుసేనుడు ధైర్యంగా యుద్ధానికి వెళ్తాడు. అతడు విజయుడై వస్తే తమ పెళ్లికి మార్గం సుగమమవుతుందని ఆశపడుతుంది దివ్య. ఇంతలో బ్రాహ్మణ యువకుడైన రుద్రధీరుడు దివ్యా పట్ల తన ప్రేమను వ్యక్తీకరిస్తాడు. దివ్యా జీవితం ఆ తర్వాత ఏ మలుపులు తిరిగిందన్నదే కథ. స్త్రీ స్వేచ్ఛ గురించి ఆలోచన రేకెత్తించేలా చిత్రించిన నవల ఇది. అనువాదమూ మూలానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.  -పద్మ

దివ్యా (బౌద్ధయుగ నవల)
రచన: యశ్‌పాల్‌
అనువాదం: పోలు శేషగిరిరావు
పేజీలు: 247; వెల: రూ. 200/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


భావప్రవాహం

భార్యాభర్తల బంధాల నుంచీ అద్దె గర్భాలవరకూ పితృస్వామ్యం నుంచీ వలసల వరకూ ఎన్నో సమస్యల్ని ఈ కవితల్లో సున్నితంగా స్పృశించారు కవయిత్రి. తనను మూరెడు తాడుతో బంధించి తీసుకెళ్లిన నాటినుండి/ అతడు తనకు చిటికెడు పరిమళాన్ని అందిస్తాడనే ఆశతో/ ఆమె ఎదురుచూస్తూ ఉంది/ కొన్నేళ్లుగా భావం లేని భాష మాత్రమే/ చప్పగా అతడి నుండి ప్రవహిస్తుంటే/ ఆమె నిర్లిప్తతను ముఖానికి పసుపులా పూసుకుంది... అంటారు ‘విషాదగీతం’లో. చంటిది లక్కపిడతల వంటేదో చేస్తోంది/ ఆ ఘుమఘుమలనాస్వాదిస్తూ నేను/ చంటిది నా ఒడిలో నిదురపోయింది/ ఒడిలో అమృతభాండంతో దాని స్వప్నాలను కంటూ నేను... అంటూ తల్లీబిడ్డల అపురూపబంధాన్ని అక్షరాల్లో పొదిగారు.  -సుశీల

కొత్త వేకువ (కవిత్వం)
రచన: పద్మావతి రాంభక్త
పేజీలు: 144; వెల: రూ. 100/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


అనుబంధాల కథలు

చెెడును తుంచి మంచిని పెంచగలిగితే అదే మనిషి జీవిత పరమార్థం అని పరోక్షంగా చాటే కథలివి. అనారోగ్యంగా ఉన్న మనవడిని పల్లెకు తీసుకెళ్లి చల్లటి గాలీ నులివెచ్చని ఎండా తగిలేలా స్వేచ్ఛగా ఆడనిస్తాడు భద్రయ్య. నగరీకరణ తాలూకు పర్యవసానాల్ని సూటిగా చెప్పే కథ ‘కిరణం’. ఉద్యోగాలు చేస్తూ చెట్టుకొకరూ పుట్టకొకరూ అన్నట్లు విడిపోయిన తోబుట్టువుల కుటుంబాల్ని కలిపే అనురాగాల వేదికలు తాతయ్యల ఇళ్లు ఏమాయ్యయి, ఎల్టీసీలతో కనువిందు ఏమో కానీ మనసు నిండుతుందా అని సూటిగా ప్రశ్నిస్తుంది ‘అగాధం’. -పూర్ణ

కిరణం (కథలు)
రచన: పి.వి.ఆర్‌.శివకుమార్‌
పేజీలు: 212; వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.