close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంకెల్లో

మనం వాడే వస్తువులు కావచ్చూ, ఫోన్‌లో ఉండే ఆప్స్‌ అవ్వచ్చూ, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలే కావచ్చు... అన్నీ మనకు తెలుసనే అనుకుంటాం కానీ, నిజానికి చాలా విషయాలు తెలియవు. అంకెలు చెప్పే అలాంటి ఆసక్తికరమైన విషయాలుకొన్ని... చదివేయండి.
* మనం ఫోన్‌ కొనేటప్పుడు కెమెరా మెగా పిక్సల్‌ ఎంతో చూసుకుని కొంటాం. మరి మన కంటి మెగా పిక్సల్‌ ఎంతో తెలుసా 576!
* అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా సెకనుకి బుక్‌ అయ్యే వస్తువుల సంఖ్య 306కి పైనే.
* ఆవు తన జీవిత కాలంలో ఇచ్చే పాలు దాదాపు 2 లక్షల గ్లాసుల పైమాటే.
* ఆకాశంలో కనిపించే మేఘాల బరువు సగటున 4.5లక్షల కేజీలు.
* మనం నిమిషానికి 20సార్లు కనురెప్పలు ఆడిస్తాం.
* నడిచేటప్పుడు మన శరీరంలో కదిలే కండరాల సంఖ్య 200.
* దేశీయ సంస్థ అయిన టాటా సుమారు 100 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ 7 లక్షల మందికి పైనే ఉపాధి కల్పిస్తోంది.
* గూగుల్‌ సెర్చ్‌లో ఒక సెకనుకు 40వేల మంది శోధిస్తారు.
* సగటున వ్యక్తి ఒక నెలలో ఉత్పత్తి చేసే లాలాజలం 232 లీటర్లు.
* ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడుపోయిన సెల్‌ఫోన్‌ నోకియా 1100. దాదాపు 25 కోట్ల మొబైల్స్‌ అమ్మిందా సంస్థ.
* 2012లో ఐఫోన్‌ ఒక్కరోజులోనే దాదాపు 3లక్షల 40 వేల ఫోన్లను అమ్మింది. అంటే సెకనుకు నాలుగు అమ్ముడయ్యాయి.
* ట్విటర్‌లో చేసే ట్వీట్ల సంఖ్య సెకనుకు 6000.
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మనదేశంతోపాటు మరో 35 దేశాల్లోనూ సేవలందిస్తోంది. విదేశాల్లో 190కి పైనే ఎస్‌బీఐ బ్రాంచీలున్నాయి.
* దాదాపు 13 లక్షల మందికి పైనే ఉద్యోగులున్న అతిపెద్ద భారతీయ సంస్థ ఇండియన్‌ రైల్వేస్‌. ఉద్యోగుల సంఖ్యపరంగా ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద సంస్థ ఇది.


* ఒంగోలు గిత్తలు దాదాపు 30 దేశాల్లో ఉన్నాయి. అత్యధికంగా బ్రెజిల్‌లోనే 16కోట్లకు పైగా ఉన్నాయి. ఇండియాలో వాటి సంఖ్య  6 లక్షల కంటే తక్కువే.

* మెక్‌డొనాల్డ్స్‌ సెకనుకు అమ్మే బర్గర్ల సంఖ్య 75.

 

* ప్రపంచవ్యాప్తంగా ఎం.ఎస్‌. ఆఫీసును రోజుకు 120 కోట్ల మంది వాడుతుంటారు.
* వాల్‌మార్ట్‌ సంస్థ ఆదాయాన్ని ప్రపంచ దేశాల జీడీపీతో పోలిస్తే ప్రపంచంలో 26 వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.


* మనం ఒక గంట హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుంటే చెవుల్లో బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుంది.


* మాల్దీవులు హనీమూన్‌కి పెట్టింది పేరు. అయితే ప్రపంచంలోనే విడాకులు అక్కడే ఎక్కువట. ప్రతి 1000లో 11 మంది ఏడాదిలోపే విడాకులు తీసుకుంటారు.

* గూగుల్‌లోని ప్రతి 100 మంది ఉద్యోగుల్లో 14 మంది డిగ్రీ ఫెయిల్‌ అయినవాళ్లే!
* యూట్యూబ్‌లో నిమిషానికి అప్‌లోడ్‌ అయ్యే వీడియోల నిడివి సుమారు 300 గంటలు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు