close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊబకాయానికి ఆరెంజ్‌!

మలాల్లోని సి-విటమిన్‌ ఆరోగ్యానికి మంచిదన్నది తెలిసిందే. అయితే వాటిల్లోని నొబిలెటిన్‌ అనే పదార్థం ఊబకాయాన్ని తగ్గిస్తుందని వెస్ట్రన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఎలుకల్లో పరిశోధన చేయగా వచ్చిన ఫలితం  తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. వీరు ఎలుకలకు అధిక కొవ్వుతో కూడిన ఆహారపదార్థాలను ఇచ్చి, అదేసమయంలో నొబిలెటిన్‌ పదార్థాన్ని కూడా ఇంజెక్ట్‌ చేశారట. చిత్రంగా, ఊబకాయం కారణంగా తలెత్తే దుష్ఫలితాలేవీ వాటిలో కనిపించలేదట. ముఖ్యంగా నొబిలెటిన్‌ కారణంగా అవి బరువు పెరగలేదు సరికదా, వాటి రక్తనాళాల్లో క్లాట్స్‌ కూడా ఏర్పడలేదు. బహుశా ఇది కొవ్వుని కరిగించడానికి వాడే ఏఎమ్‌పీ కైనేజ్‌ అనే పదార్థంలా పనిచేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు. కారణమేదయినా కమలాల్లోని ఈ పదార్థం ఊబకాయ నియంత్రణకు తోడ్పడుతుందని విశ్లేషిస్తున్నారు సదరు పరిశోధకులు.


అబద్ధాలు ఎవరు బాగా చెబుతారంటే...

దో ఒక సందర్భంలో అబద్ధం ఆడని వాళ్లు ఉండరు. అయితే ఆడవాళ్లతో పోలిస్తే అబద్ధాన్ని అతికినట్లు చెప్పగలిగే శక్తి మగవాళ్లకే ఎక్కువ ఉన్నట్లు నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ పోర్ట్స్‌మౌత్‌కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. పైగా అబద్ధాలు చెప్పేవాళ్లు మంచి వాక్చాతుర్యం ఉన్నవాళ్లై ఉంటారట. ఇందుకోసం సుమారు ఓ వందమంది మగవాళ్లనీ వందమంది స్త్రీలనీ ఎంపిక చేసి ప్రశ్నించగా- అందంగా అబద్ధాలు చెప్పేవాళ్లలో అద్భుతమైన మాట చాతుర్యం ఉన్నట్లు గమనించారట. పైగా వీళ్లు మెసేజ్‌లు, సోషల్‌ మీడియాల్లో కన్నా ముఖాముఖిగానే అబద్ధాలు చెప్పేందుకు ఇష్టపడతారట. ఇలా చెప్పేవాళ్లు తాము చెప్పేది నూటికి నూరు శాతం నిజం అన్నట్లు అబద్ధాన్ని అల్లుతారట. దాంతో వాళ్లు చెప్పేది నిజమా అబద్ధమా అన్నదాన్ని ఎవరూ త్వరగా పసిగట్టలేరట. స్త్రీలతో పోలిస్తే అబద్ధాలు చెప్పే మగవాళ్లు ఎక్కడా దొరక్కుండా అందంగా అబద్ధం చెప్పడమే కాదు, అవతలివాళ్లకు ఎక్కడా అనుమానం రాకుండా చెప్పగలిగామని తమలో తాము తెగ సంతోషపడతారట. బాగా చదువుకున్నవాళ్లు అబద్ధం చెప్పరనడానికి కూడా సరైన ఆధారం కనిపించలేదట. ముఖ్యంగా అబద్ధం చెప్పడంలో నిపుణులైనవాళ్లు నిజాన్ని చాలా చక్కగా దాచగలరనీ స్పష్టమైంది.


ప్రిబయోటిక్స్‌తో నిద్రపోవచ్చు!

నిద్రలేమి వల్ల ఒత్తిడి, ఆందోళన, ఇతరత్రా అనేకానేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే బ్యాక్టీరియా లేని ప్రిబయోటిక్స్‌ నిద్రకు మంచి మందులా పనిచేస్తాయి అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడోకి చెందిన పరిశోధకులు. సాధారణంగా ప్రొబయోటిక్స్‌లోని హానిరహిత బ్యాక్టీరియా ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది తెలిసిందే. అలాగే ఆ బ్యాక్టీరియా పెరుగుదలకి ప్రియోటిక్స్‌ తోడ్పడతాయి. అదెలా అంటే- మనం తీసుకునే కొన్ని రకాల ఆహారపదార్థాల్లోని పాలీడెక్స్‌ట్రోజ్‌, సెల్యులోజ్‌, ల్యాక్టోఫెర్రిన్‌ వంటి పీచూ ప్రొటీన్లు తేలికగా జీర్ణంకావు. కానీ అవి పొట్టలోని బ్యాక్టీరియా పెరుగుదలకి తోడ్పడటం ద్వారా మెదడు ఆరోగ్యానికి సాయపడతాయి. తద్వారా మంచి నిద్రపడుతుంది అని వివరిస్తున్నారు సదరు పరిశోధకులు. కాబట్టి ప్రొబయోటిక్‌ పదార్థాలతోబాటు ఉల్లి, ఉల్లికాడలు, క్యాబేజీ, పప్పు, ముడిధాన్యాలు, డెయిరీ ఉత్పత్తులు వంటి పీచు, ప్రొటీన్లతో కూడిన ఆహారపదార్థాల్నీ
ఆహారంలో భాగంగా చేసుకుంటే నిద్ర బాగా పడుతుందన్నమాట.


పొట్టలోని పిల్లలకీ ముప్పే!

ర్భిణీలు వాయుకాలుష్యంతో నిండిన వాతావరణంలో నివసిస్తే పుట్టిన పిల్లలమీదా ఆ ప్రభావం ఉంటుందని హూస్టన్‌లోని ‘టెక్సాస్‌ యూనివర్సిటీ హెల్త్‌ సైన్సెస్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాదు, దీనికి మాతృత్వపు ఒత్తిడి, పోషకాహారలోపం, వాతావరణ మార్పులు కూడా తోడయితే నెలలు నిండకుండానో తక్కువ బరువుతోనో పుట్టడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణంలోని మార్పులు- అంటే, విపరీతమైన వేడి, చలి ప్రదేశాల్లో నివసించే గర్భిణీల్లో ఒత్తిడి పెరిగిపోవడంతోబాటు శ్వాసకోశవ్యాధులూ ఇన్ఫెక్షన్లూ వచ్చే అవకాశం ఎక్కువ. ఆ ప్రభావం పుట్టే
పిల్లలమీదా పడుతుంది అని హెచ్చరిస్తున్నారు.


టూకీగా...

కౌమారదశలో- అంటే, పదహారేళ్లలోపు వయసులో ప్రేమాదోమా వంటివి పెట్టుకోకుండా ఉన్న అమ్మాయిలూ అబ్బాయిల్లో భవిష్యత్తులో డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు తక్కువనీ అదేసమయంలో వాళ్లలో సామాజిక
సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయని జార్జియావిశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు.

* లెగ్యూమ్‌ జాతికి చెందిన బఠాణీలూ బీన్సూ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకుని, తరచూ తినేవాళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ శాతం తక్కువగా ఉండటంతోబాటు బీపీ, మధుమేహం వంటివి కూడా నియంత్రణలో ఉన్నాయనీ తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిందనీ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన పరిశీలనల్లో స్పష్టమైంది.


తిరగనీలే...

భార్య: ఏమండీ... అప్పులిచ్చిన వారు ఇంటి చుట్టూ తెగ తిరుగుతున్నారు. వారికేం చెప్పాలి?
భర్త: తిరిగితే తిరగనీ లేవే... కాకపోతే ఇంటి చుట్టూ ఉన్న ఆ పూలమొక్కల్నీ కూరగాయ మొక్కల్నీ తొక్కొద్దని గట్టిగా చెప్పు.


ఇంకేంటి రాసేది

స్నేహితుడు: ఏంటీ ఈమధ్య కవితలు అస్సలు రాయటం లేదు.
రాజు: నేను ఎవరికోసం రాస్తున్నానో ఆమెకు పెళ్ళైపోయింది.
స్నేహితుడు: అయితే, మరిన్ని రాయాలి. విరహంలో కవితలు మరింత బాగా వస్తాయి.
రాజు: నీకు అర్థంకావటం లేదు... ఆమె పెళ్ళి నాతోనే జరిగింది.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.