close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాశిఫలం

శార్వరి నామ సంవత్సరంలో..
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

ఆదాయం 5; వ్యయం 5 రాజపూజ్యం 3; అవమానం 1

ఆర్థిక స్థితిగతులు చక్కగా ఉంటాయి. ఉన్న సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి గురువు భాగ్య స్థానంలో ఉన్నందు వల్ల విద్యా ఫలితాలు బాగుంటాయి. ప్రతిభతో నలుగురినీ మెప్పిస్తారు. ఉన్నత స్థితికి చేరుతారు. విదేశాల్లో విద్యాభ్యాసానికి కాలం అనుకూలిస్తుంది. చేపట్టే పనుల్లో విజయావకాశాలు బాగున్నాయి. వృత్తిలో రాణిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరతారు. గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పనుల ఒత్తిడి పెరిగే సూచన. కుటుంబపరంగా శుభఫలితాలున్నాయి. గృహ, భూ,వాహనాది యోగాలున్నాయి. క్రమక్రమంగా బంగారు జీవితాన్ని సాధిస్తారు. మంచి పనులు చేయడం ద్వారా వృద్ధిలోకి వస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. అనుకున్న లక్ష్యాన్ని చేరతారు. కేతు భాగ్య స్థితి వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. దైవబలం రక్షిస్తోంది. అన్నివిధాలుగా సానుకూల వాతావరణం ఉంటుంది. శని ధ్యానం మంచిది. శివారాధన శ్రేయస్సును ఇస్తుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే వారం - ఆదివారం
రంగులు - ఎరుపు, గులాబీ. అదృష్ట దైవం సూర్యుడు


ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1

చేపట్టే పనుల్లో విజయావకాశాలు మిశ్రమంగా ఉంటాయి. చదువులో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ విద్యావకాశాలు పెరుగుతాయి. ఏప్రిల్‌ నుంచి జులై 1 వరకు, నవంబరు 20 నుంచి సంవత్సరాంతం వరకు గురుబలం ఉంది. ఈ సమయంలో ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. వ్యాపారం మిశ్రమంగా ఉన్నప్పటికీ సంవత్సరం మధ్యలో ఆశించిన ఫలితం లభిస్తుంది. అవమానాలను ఎదుర్కొన్నా పట్టుదలతో ముందుకు సాగితే గౌరవం లభిస్తుంది. గృహ, వాహన లాభాలున్నాయి. గురు ధ్యానం, ఈశ్వర ఆరాధన మేలు చేస్తాయి.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6, కలిసొచ్చే వారం - బుధవారం
రంగులు - తెలుపు, ఆకుపచ్చ. అదృష్ట దైవం విష్ణుమూర్తి


ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4

పనుల్లో విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ పని తలపెట్టినా అందులో మేలు జరుగుతుంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలూ, నవంబరు 20 నుంచి డిసెంబరు మాసాల్లో ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో ఆర్థికస్థితి దెబ్బతినకుండా చూసుకోవాలి. విద్యాయోగం బాగుంది. ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశాల్లో విద్యా అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తినిచ్చే ఫలితాలు ఉన్నాయి. పెద్దల మన్ననలు అందుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. సకాలంలో విశ్రాంతి అవసరం. దైవానుగ్రహం లభిస్తుంది. వేంకటేశ్వర ధ్యానం శ్రేష్ఠం.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5, కలిసొచ్చే వారం - శుక్రవారం
రంగులు - తెలుపు, ఆకుపచ్చ. అదృష్ట దైవం లక్ష్మీదేవి


ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4

ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో తలపెట్టే కార్యాల్లో విజయావకాశాలు అధికంగా ఉంటాయి. నవంబరు 20 నుంచి కలిసి వస్తుంది. ఈ మాసాల్లో ఆర్థికాంశాలు బాగుంటాయి. విద్యలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. విదేశీ విద్యకు అనుకూల కాలం. ఉద్యోగపరంగా సాధారణ ఫలితాలకంటే మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో అనుకున్న ఫలితాలు రావడంలో విఘ్నాలు ఎదురవుతాయి. శ్రమిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యం ఫర్వాలేదు. సెప్టెంబరు 20 తర్వాత గృహ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. శ్రీరామ, ఆంజనేయ ధ్యానాలు ఉత్తమం.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2, కలిసొచ్చే వారం - మంగళవారం
రంగులు - తెలుపు, ఎరుపు. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు


ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7

కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ధనలాభం ఉంది. విద్యార్థులు చక్కని ప్రతిభతో రాణిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఎటుచూసినా మీదే పైచేయిగా ఉంటుంది. క్రమంగా పైకి వస్తారు. వ్యాపారం కలిసి వస్తుంది. లాభాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆనందంగా ఉంటారు. అదృష్ట కాలం. గృహ, వాహన యోగాలు సహకరిస్తాయి. లక్ష్మీదేవి స్మరణ శుభ ఫలితాలను ఇస్తుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1, కలిసొచ్చే వారం - గురువారం
రంగులు - గులాబీ, పసుపు. అదృష్ట దైవం శివుడు


ఆదాయం 2; వ్యయం 11 రాజపూజ్యం 4; అవమానం 7

ఏకాగ్రచిత్తంతో పనిచేస్తే లాభాలు అందుతాయి. కార్యసిద్ధికి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో ఫలితాలు చేతిదాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు, నవంబరు 20 నుంచి సంవత్సరాంతం వరకు గురువు పంచమంలో యోగాన్ని ఇస్తాడు. ఈ సమయ కార్యసిద్ధికి అనుకూలం. ఆర్థికస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. విద్యా విషయంలో అత్యంత శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ విద్యావకాశాలు మెండుగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మధ్యమ ఫలితం ఉంది. ఆశించిన ఫలితం రావాలంటే బాగా కష్టపడాలి. వ్యాపారంలో స్వయంగా కష్టపడి పనిచేస్తేనే లాభాలుంటాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. గురుశ్లోకం చదవండి. దత్తాత్రేయ ధ్యానం శుభప్రదం.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5, కలిసొచ్చే వారం - శనివారం
రంగులు - ఆకుపచ్చ, నీలం. అదృష్ట దైవం శివుడు


ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7

ఆర్థిక ఫలితాలు అంత అనుకూలంగా లేవు. అభివృద్ధి కోసం అధికంగా శ్రమించాల్సి వస్తుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. విదేశీ విద్యావకాశాలు స్వల్పంగా కన్పిస్తున్నాయి. కార్యసిద్ధి కోసం విశేషమైన కృషి చేయాలి. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారపరంగా కొన్ని సమస్యలుంటాయి. తోటివారి సహకారంతో వాటిని పరిష్కరిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. శనిస్తోత్రం చదవండి. ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5, కలిసొచ్చే వారం - శనివారం
రంగులు - ఎరుపు, పసుపుపచ్చ. అదృష్ట దైవం శివుడు


ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3

గొప్ప కార్యసిద్ధి ఉంది. క్రమక్రమంగా పైకి వస్తారు. ఆశించిన ధనలాభం ఉంటుంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటే తిరుగులేని భవిష్యత్తు ఏర్పడుతుంది. విదేశీ విద్యకు చక్కటి కాలం. అభీష్టాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. ఆశించిన స్థాయికి ఎదుగుతారు. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. దశదశలా విస్తరించే కాలమిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆహ్లాదకర వాతావరణం లభిస్తుంది. మొత్తమ్మీద అన్నివిధాలా శ్రేష్ఠమైన ఫలితాన్ని పొందుతారు. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే వారం - గురువారం
రంగులు - ఎరుపు, పసుపుపచ్చ. అదృష్ట దైవం శివుడు


ఆదాయం 11; వ్యయం 5 రాజపూజ్యం 2; అవమానం 6

వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టే పనుల్లో విజయావకాశాలు సాధారణంగా ఉన్నాయి. పనుల్లో అశ్రద్ధ పనికిరాదు. ఆర్థిక స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఖర్చు పెరుగుతుంది. వృథా వ్యయాన్ని తగ్గించండి. విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. సరస్వతీ మంత్రాన్ని చదువుకుంటూ ప్రణాళికాబద్ధంగా విద్యాభ్యాసం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. విదేశంలో విద్యావకాశాలు లభిస్తాయి. ఫలితాలు కోరుకున్న విధంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రమకుతగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారంలో కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబసభ్యుల ప్రమేయంతో ఇబ్బందుల నుంచి బయటపడతారు. తగిన జాగ్రత్తలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గణపతి, లక్ష్మి, వేంకటేశ్వర ధ్యానాలు శుభాన్ని చేకూరుస్తాయి.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే వారం - శుక్రవారం
రంగులు - నీలం, తెలుపు. అదృష్ట దైవం లక్ష్మీదేవి


ఆదాయం 8; వ్యయం 11 రాజపూజ్యం 6; అవమానం 3

అవసరాలకు ధనం అందుతుంది. దేనికీ తొందరపనికిరాదు. చేపట్టే పనుల్లో విజయావకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రయత్నాన్నిబట్టి ఫలితం లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడితే కానీ ఫలితం ఉండదు. మనసు చంచలత్వానికి గురికాకుండా చూసుకోవాలి. స్వల్ప ప్రయత్నంతోనే విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో ఏకాగ్రచిత్తంతో పనిచేయండి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో సామరస్య ధోరణితో వ్యవహరించాలి. ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. సమయానికి విశ్రాంతి తీసుకోవాలి. ఆత్మీయులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించండి. అవగాహనతో ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చెడు ఊహించకండి. స్వల్ప విఘ్నాలు ఎదురైనా గృహ లాభం సూచితం. శని, గురుశ్లోకాలు చదువుకోవాలి. విష్ణుమూర్తిని ధ్యానించడం ద్వారా విజయం లభిస్తుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3, కలిసొచ్చే వారం - మంగళవారం
రంగులు - పసుపుపచ్చ, ఎరుపు. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యస్వామి


ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 5; అవమానం 6

ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకున్న ఫలితాలను సకాలంలో సాధిస్తారు. విద్యార్థులకు అద్భుతమైన విద్యావకాశాలు ఉన్నాయి. కృషికి రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. విదేశీ విద్యావకాశాలు బాగున్నాయి. ఏలినాటి శని ప్రారంభమవుతోంది, పనుల్లో ఏకాగ్రత పెంచాలి. వృత్తిలో పైకి వస్తారు. ఉద్యోగపరమైన అభివృద్ధి గణనీయంగా లభిస్తుంది. అధికారయోగం ఉంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే వారం - బుధవారం
రంగులు - నీలం, ఆకుపచ్చ. అదృష్ట దైవం విష్ణుమూర్తి


ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2

శుభఫలితాలున్నాయి. పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు సెప్టెంబరు 20 నుంచి సంవత్సరాంతం వరకు లాభాదాయక కాలం. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్యావకాశాలు బాగున్నాయి. వృత్తిలో శుభకాలం. ఉద్యోగంలో పైకి వస్తారు. అధికార యోగముంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. స్వయంగా తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. లలితా సహస్ర పారాయణం విజయాన్నిస్తుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3, కలిసొచ్చే వారం - సోమవారం
రంగులు - పసుపుపచ్చ, తెలుపు. అదృష్ట దైవం దుర్గాదేవి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు