close
రాశిఫలం

గ్రహబలం (ఫిబ్రవరి 23 - 29)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


మంచి నిర్ణయాలు తీసుకునే సమయమిది. విశేష ధనలాభం సూచితం. బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించండి. ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. సుఖసంతోషాలున్నాయి. నిస్వార్థంగా పనిచేసి ప్రశంసలందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాల్లో లాభపడతారు. ఆంజనేయస్వామిని దర్శించండి.


అభివృద్ధినిచ్చే మార్గాన్ని ఎంచుకోండి. విజయం సాధిస్తారు. ఆర్థిక భారం పెరగకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపార నష్టం సూచితం. దగ్గరివారితో అపార్థాలకు తావులేకుండా వ్యవహరించాలి. ఇష్టదేవతా దర్శనం శుభాన్నిస్తుంది.


ధర్మమార్గంలో పయనించండి. విజయం దక్కుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్య కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. కాలానుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ  ఫలితాలుంటాయి. విష్ణు సహస్రనామం చదవండి. శాంతి లభిస్తుంది.


నిబద్ధతతో పనిచేసి లక్ష్యాన్ని చేరతారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అవగాహనా సామర్థ్యంతో పనిచేయండి. ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది. మితభాషణంతో సమస్య తొలగుతుంది.  శుభవార్త వింటారు. ఇష్టదేవతా సందర్శనం మేలు చేస్తుంది.


కీర్తి, మనశ్శాంతి లభిస్తాయి. ధనలాభం విశేషంగా ఉంటుంది. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. కాలం సహకరిస్తోంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేయండి. పెద్దల సహకారం లభిస్తుంది. మీవల్ల సమాజానికి మేలు జరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. శివారాధన శ్రేష్ఠం.


సంక్షేమమే అంతిమ లక్ష్యంగా పనిచేయండి. చక్కని విజయం సొంతమవుతుంది. కోరికలు నెరవేరతాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చంచలత్వం పనికిరాదు. ఎవరితోనూ గొడవపడవద్దు. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. క్రమంగా విజయం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పని వారాంతంలో పూర్తి అవుతుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.


ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. చంచలత్వంతో ఇబ్బందులు వస్తాయి. సకాలంలో స్పందించాలి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది, వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి. సొంత నిర్ణయం రక్షిస్తుంది. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలున్నాయి. సందర్భాన్నిబట్టి నిర్ణయాలు తీసుకోండి. ఆదిత్య హృదయం చదవాలి.


అదృష్టస్థితి ఉంది. ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. ఆలోచనలకు కార్యరూపాన్నివ్వాలి. వ్యాపార లాభాలుంటాయి. గృహసౌఖ్యం లభిస్తుంది. స్వల్ప విఘ్నాలున్నా వారం మధ్యలో శుభం జరుగుతుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. స్పష్టతతో సంభాషించండి. మిత్రబలం పెరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.


తెలివిగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. సహనంతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపార నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఏకాగ్రతతో పనిచేయండి. కాలానుగుణంగా నిర్ణయాలను తీసుకోండి. ఖర్చు పెరగరాదు. భవిష్యత్తు శుభప్రదం. ఇష్టదైవాన్ని స్మరించండి.


అభీష్టసిద్ధి ఉంది. ఆర్థికంగా లాభపడతారు. చాకచక్యంగా వ్యవహరిస్తే ఆటంకాలు ఎదురుకావు. లక్ష్మీ కటాక్షంతో రుణబాధలు తగ్గుతాయి. ప్రయత్నపూర్వక విజయముంటుంది. ఉద్యోగబలం సంపూర్ణం. శ్రమ పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబపరమైన సహకారం లభిస్తుంది. ఆనందించే అంశం ఒకటుంది. వేంకటేశ్వరస్వామిని స్మరించండి.


 

కోరికలు నెరవేరతాయి. కార్యానుకూలత విశేషంగా ఉంది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. శ్రమకు తగ్గ గౌరవం లభిస్తుంది. బంధాలు బలపడతాయి. అదృష్టయోగముంది. దగ్గరివారి సూచనలు అవసరం. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకతను సంపాదిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదవాలి.


విజయం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఏకాగ్రత అవసరం. ఓర్పు, సహనంతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. సరైన దిశానిర్దేశంతో ముందడుగు వేస్తే మంచి ఫలితం సిద్ధిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇబ్బంది కలిగించేవారికి దూరంగా ఉండాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఆదిత్యస్తుతి శుభాన్నిస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.