close

ఊరంత భవనం!

చల్లగాలులు విసురుతూ అలలతో ఎగసిపడే సముద్రం, సూర్యోదయ సూర్యాస్తమయాలను కళ్లకు కడుతూ దాదాపు కిలోమీటరు మేర పరచుకున్న సాగర తీరం, అక్కడే అందమైన మధ్యయుగం నాటి ఊరు, పక్కనే చదువుల నెలవైన ఓ విశ్వవిద్యాలయం, రెండు ఫైవ్‌స్టార్‌ హోటళ్లూ, వందల సంఖ్యలో దుకాణాలుండే మాల్స్‌, ఇవి కాక పిల్లలు ఉత్సాహంగా ఆడుకునేందుకు ఓ వాటర్‌ పార్క్‌, ఇంకా ఎన్నో... ఇదంతా చెబుతుంటే అక్కడున్నది ఓ అందమైన నగరమేమో అనిపిస్తోంది కదూ! కానేకాదు, ఒక భవనంలో ఒదిగిన విశేషాలివి! చైనాలోని చెంగ్దూ నగరంలో ఉన్న ఈ భవనం పేరు న్యూ సెంచరీ గ్లోబల్‌ సెంటర్‌. సుమారు 420 ఎకరాల విస్తీర్ణంలో- అంటే దాదాపు ఒక ఊరంత విశాలంగా దీన్ని నిర్మించారు. అందుకే, ప్రపంచంలోనే అతిపెద్ద భవనంగా గిన్నిస్‌ రికార్డుకెక్కింది. ఒకేసారి ఆరువేల మందికి ఆతిథ్యమివ్వగల ఈ భవంతిలో పగలూ రాత్రీ తేడా తెలియకుండా కృత్రిమ సూర్యుణ్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ అద్భుత భవనాన్ని వీక్షించేందుకు లక్షల్లో జనం వస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.