close

అందంగా పరిమళిస్తాయి!

ఇంట్లో సువాసన కోసం రకరకాల రూమ్‌ ఫ్రెషనర్లు చల్లడం, అరొమా కొవ్వొత్తులూ, ధూపం వెలిగించడం మనకు తెలిసిందే. అదే సెంటెడ్‌ వ్యాక్స్‌ బార్లు తెచ్చుకుంటే ఏమీ చల్లాల్సిన, వెలిగించాల్సిన అవసరం లేకుండానే ఇల్లంతా పరిమళభరితం అవుతుంది. ఎలాగంటే...

అరోమా థెరపీ మనసును ఉత్తేజపరిచి ఒత్తిడిని మాయం చేస్తుంది. కానీ ఎప్పుడూ ఆ సువాసనల్ని వెదజల్లే నూనెల్నీ పరిమళద్రవ్యాల్నీ కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అలాంటివి ప్రతిరోజూ స్ప్రే చేయడానికి మనసొప్పదు. భోజనానికి అతిథులు వస్తున్నారన్నప్పుడో... చూసి వెళ్లడానికి స్నేహితులు బయల్దేరారన్నప్పుడో టకటకా ఇల్లు సర్దేయడంతోపాటు... ఎయిర్‌ఫ్రెషనర్లూ, అరోమా నూనెలు చల్లడం, అరోమా కొవ్వొత్తులు వెలిగించడం చేస్తుంటారు చాలామంది. పైగా కొందరికి ఆ వాసనలు పడకపోవచ్చు కూడా. అలా కాకుండా తక్కువ ఖర్చులో... ప్రకృతి సిద్ధమైన సువాసనలతో ఇంటిని పరిమళభరితం చేసుకుంటే ఎంత బాగుంటుందో కదూ! కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ఈ సెంటెడ్‌ వ్యాక్స్‌ బార్లు అలాంటివే. వీటిని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఒక్క చోట పెడితే చాలు గదంతా సువాసనభరితం అవుతుంది. చూడ్డానికి కూడా కళ్లకి ఇంపుగా ఉండి... చూపరుల్ని కట్టిపడేస్తాయి. ఒక్కసారి కొంటే కొన్ని నెలలపాటు సువాసనలు వెదజల్లుతాయివి.

పూలూ... పండ్లూ...
అత్తరు గుబాళింపులు... అరవిరిసిన పూల నిగారింపులతో తయారైన ఈ బార్లు... ఎయిర్‌ఫ్రెషనర్లూ, అరోమా కొవ్వొత్తులూ, పాట్‌పౌరీలకు లెటెస్ట్‌ వర్షన్‌. అరోమా నూనెలూ, పూలూ, పండ్లూ, సుగంధ ద్రవ్యాల నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్స్‌తోపాటు నేరుగా వాటిని కూడా కలిపి తయారు చేస్తున్నారు తయారీదారులు. పలు రంగుల్లో, విభిన్న ఆకృతుల్లో తయారయ్యే ఈ బార్లలో పూలూ, పండ్లూ, సుగంధ ద్రవ్యాలూ ఒదిగిపోయి చూపర్లని ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ వ్యాక్స్‌ బార్లు చూడ్డానికి కూడా భలేగా ఉంటాయి. వీటిని గదుల్లో గోడలకి వేలాడదీయొచ్చు. అరల్లో బట్టల మధ్యలోనూ పెట్టొచ్చు, హ్యాంగర్‌కీ తగిలించొచ్చు.

పూజ గదిలో, డైనింగ్‌ టేబుల్‌ దగ్గరా, ఆఫీసులోని డెస్కుటాపుపైనా... ఇలా మనకు కావల్సిన చోటల్లా పెట్టుకోవచ్చు. ఎప్పుడూ డోర్లు మూసి ఉండే కారులో కూడా దుర్వాసనలు రాకుండా ఉండటానికి లోపల పెర్‌ఫ్యూమ్స్‌ పెడుతుంటారు.
కానీ చాలామందికి అవి పడక ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు పలు రకాల సువాసనల్లో లభ్యమయ్యే ఈ సెంటెడ్‌ వ్యాక్స్‌ బార్లు చక్కని ప్రత్యామ్నాయం అవుతాయి. కారు ముందుభాగంలో వేలాడదీసినా చూడ్డానికిఆకర్షణీయంగా ఉండటంతోపాటు హాయినిచ్చే సువాసనను వెదజల్లుతాయి. మైనం అందుబాటులో ఉంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకోసం రకరకాల మౌల్డ్స్‌ కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. బాగున్నాయి కదూ ఈ బార్లు. మరి, ఒకటి కొని తెచ్చేద్దామా... మనమే తయారు చేసేద్దామా...?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.