close
రాశిఫలం

గ్రహబలం (జనవరి 26 - ఫిబ్రవరి 1)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


అత్యంత మేలైన కాలం నడుస్తోంది. మంచి పనులు చేసి అభివృద్ధిని సాధించండి. కోరుకున్నది నెరవేరుతుంది. సుఖసౌఖ్యాలున్నాయి. ప్రయత్నం ఫలిస్తుంది. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ధర్మచింతనతో పనిచేయండి. పెద్దల సహకారం ఉంటుంది. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. ఉపద్రవాల నుండి బయటపడతారు. శివారాధన ఆనందాన్నిస్తుంది.


ఏకాగ్రతతో పనిచేయండి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఒత్తిడి పనికిరాదు. లక్ష్యం సిద్ధిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితముంటుంది. సామరస్య ధోరణి అవలంబించండి. బుద్ధిబలంతో కష్టాలు తొలగుతాయి. దగ్గరివారి సహాయం తీసుకోవాలి. ఆవేశం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఇష్టదైవాన్ని స్మరించండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది.


మనోబలంతో పనిచేయండి. అనుకున్నదాంట్లో విజయం లభిస్తుంది. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు. విశేష ప్రతిభతో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. అవసరాలకుమించి ఖర్చు సూచితం. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. వారాంతంలో అభీష్టసిద్ధి కలుగుతుంది. లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది.


సమాజంలో పేరుప్రతిష్ఠలుంటాయి. ధనలాభం సూచితం. శుభవార్త వింటారు. బంధుప్రేమ లభిస్తుంది. ఆందోళన కలిగించే ఆలోచనలు మనసును ఇబ్బందిపెడతాయి. మొహమాటం పనికి రాదు. ఆర్థికాంశాల్లో స్పష్టత లోపించరాదు. ప్రతి పనీ ఆలోచించి చేయండి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. గణపతిని స్మరించండి.


విజయపరంపర కొనసాగుతోంది. స్పష్టమైన ప్రణాళికతో పనిచేయండి. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. కాలం కలసివస్తుంది. అవరోధాలు తొలగుతాయి.సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిదానంగా ఆలోచిస్తే అంతా శుభమే జరుగుతుంది. పదవీలాభం ఉంది. విష్ణుస్మరణ మేలు చేస్తుంది.


అదృష్టయోగముంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. తొందరవద్దు, సహనంతో లాభపడతారు. ఆత్మీయుల సూచనలతో పని పూర్తవుతుంది. దైవానుగ్రహంతో మంచి జరుగుతుంది. ఆపదల నుండి బయటపడతారు. ముఖ్యమైనవారితో మనసు విప్పి మాట్లాడతారు. శివారాధన మేలుచేస్తుంది. ఆరోగ్యంపైన దృష్టి నిలపండి. విశ్రాంతి అవసరం.


ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. ధర్మం రక్షిస్తుంది. పెద్దల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారలాభం చేకూరుతుంది. ఒక ఆపద వచ్చి పోతుంది. ఆందోళన కలిగించే అంశాలను పదేపదే గుర్తుచేసుకోకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబసభ్యుల సూచనలు అవసరం. కలహాలకు అవకాశముంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి.


అద్భుతమైన శుభయోగాలున్నాయి. తిరుగులేని విజయం సొంతమవుతుంది. లక్ష్మీ కటాక్షం ఉంది. ఎప్పుడో చేసిన ఒక పనికి సంబంధించిన ఫలితం ఇప్పుడు శుభాన్నిస్తుంది. అనుకున్న పనుల్లో అభివృద్ధి మొదలవుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు కలసి వస్తాయి. అవరోధాలు తొలగుతాయి. ఆనందించే అంశాలున్నాయి. కాలం సహకరిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


ఆర్థికంగా శుభకాలం. వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. అదృష్టం కలసి వస్తుంది. భోగభాగ్యాలున్నాయి. లక్ష్యసాధనలో అడుగు ముందుకు వేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గరాదు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగాలి. ఎప్పటికప్పుడు ఆత్మీయులతో చర్చించండి. ఓర్పు రక్షిస్తుంది. అపార్థాలకు తావివ్వరాదు. ఇష్టదైవస్మరణ మంచిది.


ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే లాభపడతారు. అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది. ఖర్చు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. భూ, గృహ సౌఖ్యాలు కలుగుతాయి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. మిత్రుల సలహా పాటించండి. విఘ్నాలను సునాయాసంగా దాటతారు. ఉత్సాహంగా ముందుకుసాగాలి.  శుభవార్త ఆనందాన్నిస్తుంది. నారాయణ స్మరణ మేలు చేస్తుంది.


కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మనోభీష్టసిద్ధి కలుగుతుంది. ధర్మబద్ధంగా పనిచేసి ప్రశంసలు పొందుతారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. నూతన బాధ్యతలు వస్తాయి. అవరోధాలు వాటంతటవే తొలగుతాయి. అదృష్టయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి భవిష్యత్తుకు పునాదులు వేయండి. సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది.


చక్కని శుభకాలం నడుస్తోంది. చాలాకాలంగా కాని పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితం ఉంది. ఇబ్బందిపెట్టేవారు తారసపడతారు. మొహమాటం లేకుండా వ్యవహరించాలి. వివాదాలకు తావివ్వరాదు. క్రమంగా అభివృద్ధి చెందుతారు. పెద్దల ఆశీర్వచనంతో కార్యసిద్ధి లభిస్తుంది. ఇష్టదేవతారాధన శాంతినిస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.