close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చదివించే కథలు

తల్లి పాడే లాలిపాట ఎలా ఉంటుందో అతనికి తెలియదు. ఆమె చిన్నప్పుడు చేసిన ముద్దూముచ్చట్ల గుర్తే లేదు. తండ్రి దగ్గరే పెరిగి పెద్దయ్యాడు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా తల్లి ఎదురుపడితే ఎలా స్పందించాడు? తనకి జీవితాన్నీ విలువల్నీ పంచిన తండ్రికి ఆ అబ్బాయి ఇచ్చిన కానుక ఏమిటో చెప్పే కథ ‘నాన్నకో బహుమతి’. జీవితాంతం ఎవరో ఒకరి పంచన బతికే స్త్రీల పరిస్థితిని కళ్లకు కడుతుందిది. కథలన్నీ మనిషి ప్రవర్తనలోని వైరుధ్యాలకు అద్దంపడతాయి. సులభంగా సాగే శైలి, చక్కటి  కథనంతో ఆసక్తిగా చదివిస్తాయి. జీవితాన్ని ఓ యజ్ఞంలా భావించి జీవితమంతా దానధర్మాలకే వెచ్చించిన మహాలక్ష్మమ్మ కథ చదువుతుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘ఆడదాని మనసు’, ‘కన్నంత మాత్రాన...’ కథలు ఆసక్తికరమైన ముగింపుతో ఆలోచన రేకెత్తిస్తాయి. పుస్తకంలోని పదహారు కథలూ
ఆపకుండా చదివిస్తాయి.

- ఆజాద్‌

నాన్నకో ‘బహుమతి’!
రచన: కొత్తపల్లి ఉదయబాబు
పేజీలు: 177: వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 9441860161


కన్నడ కదంబం

కువెంపు, పూర్ణచంద్రతేజస్వి, కుం.వీరభద్రప్ప తదితర ప్రఖ్యాత రచయితల పాతికపైగా కథలను అనువదించి వెలువరించిన సంకలనమిది. విభిన్న ఇతివృత్తాలతో ఆకట్టుకునే కథలే అన్నీ. నోట్లరద్దు ప్రకటనతో కలవరపడిన పిసినారి మార్వాడి ఏం చేశాడో చెప్పే కథ ‘వ్యభిచారం’. అతని లోభత్వం నుంచి వేశ్యావాటికల్లో వ్యక్తుల తీరు వరకూ ఎన్నో కోణాలు కనిపిస్తాయిందులో. హద్దుల్లేని తన ప్రవర్తన కారణంగా ఓ వ్యక్తి కుటుంబాన్ని కోల్పోయి, జీవితపర్యంతం పశ్చాత్తాపపడటాన్ని ‘కాంచన రథం’లో చూడొచ్చు. ‘చివరి క్షణాల్లో’, ‘వరాహపురాణం’, ‘రహస్య విశ్వం’ తదితర కథలు ఆలోచింపజేస్తాయి.

- పార్థసారథి

వైరాగ్యంలోని మహిమ
(కన్నడ అనువాద కథలు)
అనువాదం: శాఖమూరు రామగోపాల్‌
పేజీలు: 289: వెల: రూ.300/-
ప్రతులకు: ఫోన్‌- 90525 63666


యానాం తలపోతలు

పాఠకులని పచ్చటి జ్ఞాపకాల పరిమళాలూ, వెచ్చటి కన్నీటి జడులమధ్య యానాం యాత్ర చేయించే కవితలివి. మన వేలుపట్టుకుని మరీ తీసుకెళ్లినట్టు తన పరిసరాలనీ, మనుషుల్నీ ఈ కవితల్లో చూపిస్తారు శిఖామణి. ‘నరసమ్మగారూ!/ సంజీవి నా పెద్ద కొడుకని/ఊరందరితో మీరు వుత్సాహంగా చెప్తుంటే/అంబేద్కర్‌ విగ్రహాన్ని/అగ్రహారంలో ప్రతిష్ఠించినంతగా/సంబరపడిపోయాను’ అంటూ ఉపమానాలతో మెప్పిస్తారు. ‘కంటికి పెట్టగా మిగిలిన కాటుకరేఖలతోనూ/నుదుట దిద్దగా మిగిలిన కుంకుమరజనుతోనూ/ బాల్యంలో మా మట్టింటి గోడలు...’ పునిస్త్రీల్లా ఎలా కనపడతాయో బొమ్మ కడతారు. వరదగోదావరిలాంటి నడకతో పాఠకుల్ని లాక్కెళ్లినా... అంతర్వాహినిలా ఆర్ద్రభావాల్ని మిగిల్చిపోతాయీ కవితలు.

- అంకిత

యానాం కవితలు
రచన: శిఖామణి
పేజీలు: 208: వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


నగరజీవనానికి ఆవలివైపు...

జీవనోపాధిని ఇచ్చిన నగరం అంటే ఎవరికైనా ప్రేమే. అయితే ఆ నగరానికున్న మరో పార్వ్శాన్ని చూశారు రచయిత్రి. అందుకామె మురికివాడల గల్లీలన్నీ తిరిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారి బతుకుకథలను విని అక్షరీకరించారు. మూసీనది మాట్లాడితే ఏం చెబుతుందో తన గొంతుతో చెప్పారు. చేతులకు పుళ్లు పడినా మానకుండా చర్మానికి ఉప్పుపెట్టే పనిచేసే నిరుపేద మహిళల గురించీ చిరువ్యాపారుల కష్టాల గురించీ రోజుకు పన్నెండు గంటలు పనిచేసే కాటేదాన్‌ కార్మికుల గురించీ... ఇలా ఎన్నో విషయాలను
చర్చించారు. ఎక్కడెక్కడినుంచో వచ్చి తమ రెక్కల కష్టంతో నగరాన్ని నడిపిస్తున్న శ్రామికుల బతుకుకథలెన్నో ఉన్న ఈ పుస్తకం హైదరాబాద్‌ నగర జీవనంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది.

- పద్మ

మూసీ నది మాట్లాడితే..!
రచన: కవిని ఆలూరి
పేజీలు: 196: వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.