close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎవరు ఏమన్నారు


వ్యాక్సిన్‌ పంపిణీపై విస్పష్ట విధానం

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసే దేశాల సరసన భారత్‌ కూడా ఉండనుంది. కాబట్టి...ఈ వ్యాక్సిన్‌ అందరికీ లభ్యమయ్యేలా, అందుబాటు ధరలో ఉండేలా పారదర్శక పంపిణీ విధానం అవసరం. టీకాను నిష్పాక్షికంగా అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని విస్పష్టంగా వివరించాలి.

- కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ


ఇజ్రాయెల్‌-యూఏఈ బంధం అభినందనీయం

ఇజ్రాయెల్‌తో యూఏఈ కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అభినందనీయం. యూఏఈ విదేశాంగమంత్రి నాకు ఫోన్‌ చేశారు. ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గురించి కూలంకషంగా వివరించారు. హృదయపూర్వక అభినందనలు తెలియజేశా.

- కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌


బైడెన్‌ గెలిస్తే అమెరికా నాశనం

ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధిస్తే అమెరికా కుప్పకూలుతుంది. ప్రపంచంలో నవ్వులపాలవుతాం.

- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌


గతమెంతో గర్వకారణం

నా ప్రియ మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీకీ, దేశ ప్రజలకూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు. భారతీయులకు గర్వకారణమైన గతం ఉంది.

- ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.