close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎవరు ఏమన్నారు

జాతీయ అవయవదాన రిజిస్టర్‌ కోసం ప్రైవేటు బిల్లు

దేశంలోని వయోజనులందరి పేర్లను జాతీయ అవయవ దాన రిజస్టర్‌లో చేర్చేలా నేను ఓ ప్రైవేటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతాను. ఆసక్తి లేకుంటే ఎవరైనా ఈ రిజిస్టర్‌ నుంచి వైదొలగవచ్చు. అవయవాలు దొరకనందున సంభవించే మరణాల సంఖ్యను ఈ రిజిస్టర్‌ గణనీయంగా తగ్గిస్తుంది.

- వరుణ్‌ గాంధీ, పిలిభిత్‌ లోక్‌సభ సభ్యుడు


అది ప్రాణాంతకం

సాహసం ప్రమాదకరమని భావిస్తే.. రొటీన్‌గా ఉండేందుకే యత్నించండి. కానీ అది  ప్రాణాంతకం.

- పాలో కొల్హో పరుసవేది రచయిత


80 కోట్ల మందికి ఆ సౌకర్యమే లేదు..

కొవిడ్‌-19పై పోరులో ముఖ్యమైన అంశాల్లో చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ఒకటి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 81.8 కోట్ల మందికిపైగా విద్యార్థులు తమ పాఠశాలల్లో చేతులు శుభ్రం చేసుకునే సౌకర్యానికి నోచుకోలేకపోయారు

- ప్రపంచ ఆరోగ్య సంస్థ


ప్రతిక్షణం గుర్తొస్తున్నావ్‌

నువ్వు మమ్మల్ని వీడిన 900 రోజుల నుంచి ప్రతిక్షణం నిన్ను కోల్పోతూనే ఉన్నాం. జాహ్నవి ‘గుంజన్‌’ సినిమాకు వస్తున్న స్పందన తెలిసిన తర్వాత.. నీ మోముపై ప్రత్యక్షమయ్యే నవ్వును ఈ రోజు మరింతగా కోల్పోతున్నాం. నీవు లేకుండా మా సంతోషానికి పరిపూర్ణత లేదు.

- బోనీ కపూర్‌, బాలీవుడ్‌ నిర్మాత (భార్య శ్రీదేవి జయంతి సందర్భంగా)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.