close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు నామమాత్రమే

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లోకి నామమాత్రంగానే నీటి ప్రవాహం ఉంది. అన్ని రిజర్వాయర్లు ఖాళీగానే ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆలమట్టిలోకి ఇప్పటివరకు 47 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. మరో 70 టీఎంసీలు వస్తే గానీ దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. గోదావరిలో పైనున్న జైక్వాడిలోకి ఇప్పటివరకు ఐదున్నర టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అయితే ప్రాణహితలో కొంత ప్రవాహం ఉన్నందున త్వరలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది.
నెట్టెంపాడు నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభం
ధరూరు,  న్యూస్‌టుడే: జూరాలకు వరద రాక పెరగడంతో నెట్టెంపాడు నుంచి నీటి ఎత్తిపోత మొదలైంది. ఎగువన కర్ణాటకలో వర్షాలతో జూరాలకు వరద పెరిగింది. దీంతో శనివారం నెట్టెంపాడు లిఫ్ట్‌లను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీఏం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నీటిని ఎత్తిపోస్తున్నామన్నారు. శనివారం ఉదయం నీటి ఎత్తిపోతకు ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే గ్రిడ్‌ నుంచి పంపింగ్‌ కేంద్రం.. విద్యుత్తు ఉప కేంద్రానికి విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా పంపులు ఆన్‌ కాలేదు. తిరిగి సాయంత్రం 5 గంటలకు పంపు నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభించారు. జూరాలకు 5వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అందులో 500 క్యూసెక్కులను నెట్టెంపాడు పంపుల కోసం వినియోగిస్తున్నామని ప్రాజెక్టు ఈఈ రహీముద్దీన్‌ తెలిపారు.  
నేడు, రేపు ఒక మాదిరి వర్షాలు
ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర కోస్తాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు శనివారం తెలిపారు. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రేబర్తి(సిద్దిపేట  జిల్లా)లో 17.2 సెంటీమీటర్లు, రెడ్డిగూడ(సూర్యాపేట)లో 12.7, నర్మెట్ట(జనగామ)లో 12.2, మిర్‌దొడ్డి(సిద్దిపేట)లో 11.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా ఎల్కపల్లి(కుమురంభీం)లో 7, మంగపేట(ములుగు)లో 6.9  సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.