close

ప్రధానాంశాలు

ఎడమ కాలువ లైనింగ్‌ వైపే మొగ్గు!

దాంతోటే సాగర్‌ చివరి ఆయకట్టు రైతులకు నీరు
ఆ తర్వాతే ఎత్తిపోతల నిర్మాణాలపై దృష్టి
క్షేత్రస్థాయి పర్యటన అనంతరం విశ్రాంత ఇంజినీర్ల బృందం అంచనా
ఈనాడు - హైదరాబాద్‌

ల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాలువను బలోపేతం చేయడం ద్వారానే చివరి ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు విశ్రాంత ఇంజినీర్ల బృందం అంచనా వేసింది. ఎడమ కాలువ కింద ఉన్న మండలాల్లో పరిస్థితిని తెలుసుకోవడానికి గత నెల ఇంజినీర్ల బృందం మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించింది. కాలువ ద్వారా నీళ్లు అందకపోవడం, సమస్యను సరిచేసేందుకు ఎత్తిపోతల పథకాల నిర్మాణంపైనా అధ్యయనం చేపట్టింది. మూడు నుంచి ఐదు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తే ఆయకట్టును స్థిరీకరించవచ్చని అంచనా వేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బృందం కాలువ లైనింగ్‌ దెబ్బతినడం, ప్రవాహానికి అనుగుణంగా కాలువ లేకపోవడాన్ని గుర్తించింది. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన లైనింగ్‌ నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతోనే సమస్య జటిÈలంగా మారడానికి కారణమైనట్లు అభిప్రాయానికి వచ్చారని తెలిసింది. సాగర్‌ ఇంజినీర్లతో పటాల సహాయంతో పలు దఫాలు అధ్యయనం చేసిన బృందం ఎత్తిపోతల పథకాల నిర్మాణానికన్నా ముందు కాలువకు లైనింగ్‌ పూర్తి చేస్తే మెరుగైన ఫలితం ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. దాదాపు రూ.200 కోట్లు వెచ్చిస్తే ప్రధానమైన సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. హుజూర్‌నగర్‌, కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ఇది ఒక మార్గంగా భావిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలకు నీళ్లు అందకపోయినట్లయితే ఇప్పటికే ఉన్న నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఎత్తిపోతల పథకాలను పటిష్ఠం చేసి వినియోగించుకోవచ్చన్న అంచనాకు వచ్చింది. నివేదికను రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందజేసేందుకు బృందం ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.