
ప్రధానాంశాలు
బస్సులో ప్రాణాలొదిలిన వృద్ధుడు..
భార్య సహా దించేసిన సిబ్బంది
బొబ్బిలి, న్యూస్టుడే: మానవత్వం మంటగలిసింది. ఆర్టీసీ బస్సులో ప్రాణాలు విడిచిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని, ఆయన భార్యను బస్సు సిబ్బంది మార్గమధ్యంలోనే దించేశారు. ఈ విషాదం విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం చోటుచేసుకుంది. సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పైడయ్య (62), పైడమ్మ దంపతులు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నారు. పైడయ్య కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో భార్యాభర్తలు పార్వతీపురంలో నాటువైద్యం పొందేందుకు సోమవారం బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలో గుండెపోటుతో వృద్ధుడు చనిపోయారు. దంపతులను బస్సు సిబ్బంది మధ్యలోనే బొబ్బిలి పెట్రోలుబంక్ కూడలి వద్ద దించేసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడు కృష్ణదాస్, స్థానికులు కొందరు వారిని ఆటోలో స్వగ్రామానికి పంపించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- నేనున్నానని..
- రివ్యూ: పవర్ ప్లే
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- మనసు లాగుతోందా బంగారం
- అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!
- నలుగురితో ప్రేమ.. లక్కీ డ్రా తీసి ఒకరితో పెళ్లి!
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
- పేలింది పంత్ పటాకా