close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆలోచన అదిరింది.. మిడత బెదిరింది

మొలకలను రక్షించుకునేందుకు రైతు వినూత్న ప్రయోగం

పాలీహౌస్‌లో సాగు చేసే పంటలకు మిడతల బెడద ఉంటుంది. విత్తనాలు పెట్టగానే అవి విత్తనం, అప్పుడే వస్తున్న మొలకలను తినేస్తుంటాయి. ఆదిలాబాద్‌ జిల్లా భీంసరికి చెందిన హన్మండ్ల పెద్దఈరన్న అనే రైతు గతేడాది విత్తన స్థాయిలోనే మిడతలతో భారీగా నష్టపోవడంతో ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి రైతులతో చర్చించి మిడతల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ ఆలోచన చేశారు. విత్తు పెట్టిన చోట ప్లాస్టిక్‌ గ్లాస్‌ను బొర్లించారు. మిడతల దానిపై వాలి విత్తును తినేందుకు ప్రయత్నిస్తే.. చిన్నగా శబ్దం రావడంతో అవి వెళ్లి పోతున్నాయి. దీంతో వాటి బెడద తప్పింది. మొలక నిలదొక్కుకున్నాక గ్లాస్‌లను తీసేయడంతో ఎలాంటి నష్టం జరగకుండా పంట సాగవుతోందని ఉద్యానశాఖ అధికారి తెలిపారు.

-న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు