close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చౌకలో గాలి నుంచి నీరు

సింగపూర్‌ శాస్త్రవేత్తల ఘనత

వాషింగ్టన్‌: గాలి నుంచి నీటిని ఒడిసిపట్టేందుకు ఉపయోగపడే ఒక పదార్థాన్ని సింగపూర్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రక్రియ కోసం వెలుపలి నుంచి ఎలాంటి శక్తినీ ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడం విశేషం. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ పరిశోధకులు అత్యంత తేలికైన ఏరోజెల్‌ను తయారుచేశారు. ఇది స్పాంజిలా పనిచేస్తుంది. బ్యాటరీ కూడా అవసరంలేదు. ఈ ఏరోజెల్‌.. గాలి నుంచి నీటిని గ్రహిస్తుంది. ఈ నీటి సేకరణ కోసం దాన్ని పిండాల్సిన అవసరం కూడా లేదు. కేజీ ఏరోజెల్‌ ద్వారా 17 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ పదార్థాన్ని పాలీమర్లతో తయారుచేశారు. ఇవి గాల్లోని నీటి అణువులను ఆకర్షిస్తాయి. ఆ తర్వాత వాటిని ద్రవ రూపంలోకి కండెన్స్‌ చేస్తాయి. అనంతరం నీటిని విడుదల చేస్తాయి. బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఏరోజెల్‌.. చాలా వేగంగా పనిచేస్తుంది. ఆ పరిస్థితుల్లో.. తాను ఒడిసిపట్టిన దానిలో 95 శాతం నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఈ పద్ధతిలో ఉత్పత్తయిన నీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు