close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎర్ర తివాచీపై.. ట్రింగ్‌ ట్రింగ్‌!

ఈనాడు, వరంగల్‌:  రహదారిపై ఎర్ర తివాచీలా కనిపిస్తున్న ఇది హన్మకొండ ‘నిట్‌’ ముందు సైకిలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ట్రాక్‌. స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా ‘ఇండియా ఫర్‌ సైకిల్‌ ఛాలెంజ్‌’ పథకం వరంగల్‌కు మంజూరైంది. ఈ మేరకు వరంగల్‌ మహానగర పాలక సంస్థ కాజీపేట నుంచి హన్మకొండ వరకు నాలుగు కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్‌ నిర్మించి దానికి ఎరుపురంగు వేసింది. నిట్‌ ఎదుట ఇలా ఆకర్షణీయంగా  కనిపిస్తోంది. రహదారికి రెండు వైపులా ట్రాక్‌ నిర్మించిన క్రమంలో సైకిలిస్టులు దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు