
ప్రధానాంశాలు
కదల్లేని తన మనవడిని ఆదుకోవాలంటున్న వృద్ధురాలు
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో...మానసిక దివ్యాంగుడైనందున తల్లి విడిచిపెట్టిపోవడంతో ఆ బాలుడు నిరుపేద వృద్ధురాలైన నానమ్మకు భారంగా మారాడు. మెదడుకు సంబంధించిన వ్యాధితో మంచానికే పరిమితమైన తొమ్మిదేళ్ల సాత్విక్‌కు మందులు కొనలేక ఆ వృద్ధురాలు ఆవేదన చెందుతోంది. ముది వయసులో దివ్యాంగుడైన మనవడిని ప్రాణప్రదంగా చూసుకుంటూ ప్రభుత్వం, దాతలు చేయూత అందించి తన మనవడిని ఆదుకోవాలని వేడుకుంటోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ బీసీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు ఈరవేణి ఎల్లవ్వ, బాబులది పేద కుటుంబం. వీరి కుమారుడు యాదయ్య కామారెడ్డి జిల్లాలో 2013 అక్టోబరు 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. దీంతో నవమాసాలు మోసి పెంచిన తల్లి మానసిక దివ్యాంగుడనే (మెదడుకు సంబంధించిన వ్యాధి) కారణంతో కనీసం నడవలేని సాత్విక్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. వృద్ధురాలి భర్త బాబు అనారోగ్యంతో 2020 జూన్‌లో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆ దివ్యాంగ బాలుడి సంరక్షణ భారం ఎల్లవ్వపైనే పడింది. ఇప్పటి వరకు సుమారు రూ.2 లక్షలు అప్పుచేసి బాలుడి వైద్యానికి వెచ్చించినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. సాత్విక్‌కు ప్రతి నెలా వచ్చే దివ్యాంగ పింఛన్‌తో ఇల్లు నెట్టుకొస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ బాలుడికి ఖరీదైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా చిన్నారిని ఆసుపత్రిలో చూపించాల్సి ఉంటుందని వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. తనకు వితంతు పింఛన్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారి సాత్విక్‌కు మందుల కొనుగోలు, ఇతర ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని, దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటోంది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50