close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆదుకుంటున్న మునుపటి కరోనా ఇన్‌ఫెక్షన్లు

కొవిడ్‌ బాధితుల్లో కొందరికి వీటి ద్వారా రక్షణ!

హ్యూస్టన్‌: గతంలో వచ్చిన కరోనా వైరస్‌ల వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీల వల్ల కూడా ఉపయోగం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిడ్‌-19 సోకిన వారికి వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వ్యాధి లక్షణాల తీవ్రతలో వైరుధ్యాలకు కారణాలను కొంత మేర ఇవి వెల్లడి చేస్తున్నాయని చెప్పారు. అమెరికాలోని ‘ట్రాన్స్‌లేషనల్‌ జీనోమిక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (టిజెన్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ‘పెప్‌సీక్‌’ అనే వినూత్న సాధనాన్ని ఉపయోగించారు. దీని సాయంతో.. మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే అన్ని రకాల కరోనా వైరస్‌లకు మానవ యాంటీబాడీలు ఎలా స్పందిస్తాయన్నది పరిశీలించారు. తద్వారా మునుపటి కరోనా వైరస్‌లకు గురైనవారిలోని యాంటీబాడీ స్పందనను.. తాజా సార్స్‌-కోవ్‌-2తో ఇన్‌ఫెక్షన్‌ బాధితుల్లోని స్పందనతో పోల్చి చూశారు. పరిశోధకులు గమనించినవాటిలో ప్రమాదకరమైన మెర్స్‌, సార్స్‌ ఉన్నాయి. వీటితోపాటు ఆల్ఫా కరోనావైరస్‌లైన 229ఈ, ఎన్‌ఎల్‌63, బీటా కరోనావైరస్‌లైన ఓసీ43, హెచ్‌కేయూ1లు కూడా ఉన్నాయి. ఈ నాలుగు రకాల వైరస్‌లు మానవుల్లో విస్తృతంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. గతంలో వీటి బారినపడినప్పుడు సదరు వ్యక్తిలోని రోగ నిరోధక వ్యవస్థ వెలువరించిన యాంటీబాడీలు.. తాజా సార్స్‌-కోవ్‌-2కు స్పందనగా క్రియాశీలమవుతున్నట్లు తేల్చారు. కొవిడ్‌ సోకిన కొందరిలో వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండటానికి ఇదే కొంతమేర కారణమై ఉండొచ్చని చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు