
డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునేందుకు నారీమణుల ఆసక్తి
వీరిలో ద్విచక్ర వాహనాలు నడిపేవారే అధికం
ఈనాడు, హైదరాబాద్: అన్నిటా పురుషులతో పోటీపడే నారీమణులు డ్రైవింగ్‌లోనూ రాణిస్తున్నారు. లైసెన్సులు తీసుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గడిచిన మూడేళ్లుగా వాహనాలు నడిపే మహిళల సంఖ్య అధికం కావడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో జారీ అవుతున్న డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్య దీన్ని ధ్రువీకరిస్తోంది. లైసెన్సులు తీసుకుంటున్న పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య పది శాతమే ఉంది. అయిదారేళ్లలో మహిళా డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్యలో 40 నుంచి 50 శాతం వరకు పెరుగుదల ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జారీ అవుతున్న లైసెన్సుల్లో యాభై శాతానికి పైగా హైదరాబాద్ పరిధిలోనే ఉంటున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఇప్పుడిప్పుడే పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తం మీద ఏడాదికి దాదాపు 40 వేల మంది వరకు మహిళలు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. అదే పురుషుల సంఖ్య మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు ఉంది. మునుపటితో పోలిస్తే ద్విచక్ర వాహనాలు నడిపే మహిళల సంఖ్య అధికంగా ఉందని అధికారుల అంచనా. సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తే ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
కథనాలు
దేవతార్చన

- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- పెళ్లే సర్వం, స్వర్గం