close
డయేరియా నివారణకు టీకా

ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించిన పరిశోధకులు

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ఏటా వేలమంది చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న డయేరియా(నీళ్ల విరేచనాలు)కు అడ్డుకట్ట వేయగల సరికొత్త టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. చిన్నారుల్లో అది ప్రభావవంతంగా పనిచేస్తోందని, దాని వినియోగం సురక్షితమేనని బంగ్లాదేశ్‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో తేలింది. సాధారణంగా విషపూరిత ఇ-కోలి బ్యాక్టీరియా కారణంగా డయేరియా వస్తుంది. దాన్ని నివారించే టీకాలేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో స్వీడన్‌లోని గుటెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం ‘ఎట్వాక్స్‌’ అనే టీకాను అభివృద్ధి చేసింది. అందులోని క్రియారహిత ఇ-కోలి బ్యాక్టీరియా, ‘ఎల్‌సీటీబీఏ’ ప్రోటీన్‌ చిన్నారుల్లో డయేరియా నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించగలుగుతున్నట్లు తేలింది. 6 నెలల నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న పిల్లలపై అది ప్రభావవంతంగా పనిచేసినట్లు పరిశోధకులు వెల్లడించారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.