close
రాగిలడ్డూ.. రాలేదింకా!

సర్కారు బడుల్లో బాలికలకు ఇవ్వాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు రాగిలడ్డూ అందించాలన్న ప్రతిపాదన విద్యాసంవత్సరం ప్రారంభమై అయిదు నెలలైనా కార్యరూపం దాల్చలేదు. బాలికల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల ద్వారా గుర్తించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా 6, 7, 8 తరగతుల విద్యార్థినులకు రాగిలడ్డూలను సరఫరా చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మే 21న దిల్లీలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) భేటీలో ఈ మేరకు ప్రతిపాదన చేసింది. మధ్యాహ్న భోజన పథకం కింద మొత్తం రూ.318 కోట్లుకు కేంద్రం ఆమోదం ఇచ్చింది. అందులో రాగిలడ్డూల సరఫరాకు రూ.8.06 కోట్లు ఉండగా.. కేంద్రం తమ వాటాగా 60 శాతం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, నిధుల కొరత కారణంగా అధికారులు ఇప్పటివరకు పథకం అమలుపై దృష్టిసారించలేదు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా టెండర్ల ప్రక్రియ పూర్తయి సరఫరా చేయడానికి కనీసం నెలకుపైగానే పడుతుంది. త్వరగా అమలుకు చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఏడాది అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ను వివరణ కోరగా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామని.. వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు.

ఇదీ ప్రణాళిక..
*  ప్రతిపాదన : రాష్ట్రంలో 3,53,565 మంది బాలికలకు వారానికి 3 రోజులు చొప్పున 13 వారాలు రాగి లడ్డూలు ఇవ్వాలి.
*  కావాల్సిన నిధులు: రూ.8.06 కోట్లు (కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం).

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.