close
ఇంటి ముంగిటకే రైస్‌ మిల్లు

మెట్‌పల్లిలో ఓ యువకుడి ప్రయోగం

మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే: రైతుల ఇంటి ముందుకే మొబైల్‌ రైస్‌మిల్లింగ్‌ యంత్రాన్ని తీసుకువచ్చి ధాన్యాన్ని బియ్యం రూపంలో మార్చి అందిస్తున్నాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మారుతీ నగర్‌కు చెందిన జక్క సుభాష్‌ గతంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉపాధి పొందేవారు. ఈ నేపథ్యంలో వారి కష్టాలను తెలుసుకున్న సుభాష్‌.. ఝార్ఖండ్‌ నుంచి రూ.4.80 లక్షలకు మొబైల్‌ రైస్‌మిల్లింగ్‌ యంత్రాన్ని తెచ్చి నేరుగా రైతుల ఇంటి ముందే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అందిస్తున్నాడు. ఈ యంత్రం గంటకు 15 క్వింటాళ్ల ధాన్యం పడుతుంది. 5 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది. క్వింటాకు 6 కిలోల తవుడు వస్తోంది. ఈ మొబైల్‌ రైస్‌మిల్లింగ్‌ యంత్రంతో నెలకు రూ.15 వేల వంతున ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నారు సుభాష్‌.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.