
విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించేందుకు బీటెక్‌కు ముందు ఆప్టిట్యూడ్ పరీక్ష!
కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ముందుగా ఆప్టిట్యూడ్ టెస్టును నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ యోచిస్తోంది. సహ విద్యార్థులు చేరుతున్నారనో.. తల్లిదండ్రులు చెప్పారనో ఇష్టం లేకున్నా.. తగిన శక్తి సామర్థ్యాలు లేకున్నా బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు చాలామంది. కొందరైతే మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని నివరించడానికే ఈ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్ష నిర్వహణను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ)కు అప్పగించాలని భావిస్తోంది. ఎవరు ఏ రంగంలో రాణిస్తారో.. అందుకు ఎటువంటి నైపుణ్యాలు అవసరమో సరైన మార్గదర్శకం చేసే పరిస్థితి లేక విద్యార్థులు డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇంజినీరింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశానికి సిద్ధపడుతున్నారు. లక్షలమంది ఏదో చేరాం కదాని ఏదోకవిధంగా చదువును పూర్తి చేస్తున్నారే తప్ప నైపుణ్యం సాధించలేకపోతున్నారు. ఫలితంగా ప్రాంగణ నియామకాల్లో 40 శాతంమందే ఎంపికవుతున్నారు. వేలాదిమంది విద్యార్థులు మధ్యలో చదువు మానేస్తున్నారు. చాలామంది ఆ కోర్సుకు తగిన నైపుణ్యం సాధించలేక.. ఎలాగో పూర్తిచేసి చిన్నచిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. లేకపోతే నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు కోర్సులో చేరేముందు ఆప్టిట్యూడ్ టెస్టు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.
ఎగ్జిట్ పరీక్షకు బదులు
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఇంజినీరుకు కావాల్సిన నైపుణ్యాలు ఉండటం లేదని, అందుకే చదువు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పరీక్ష నిర్వహించాలని, అందులో ఉత్తీర్ణులైతేనే డిగ్రీ పట్టా ఇవ్వాలని గత ఏడాది నుంచి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. కాని దీనిపై పలు రాష్ట్రాల నుంచి విమర్శలు వచ్చాయి. నాలుగేళ్లు చదివిన తర్వాత మీకు నైపుణ్యాలు లేవని అంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనమైనట్లు కాదా? అన్న ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో కోర్సులో ప్రవేశించడానికి ముందే ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులే తాము ఇంజినీరింగ్ రంగంలో రాణించగలుగుతామో.. లేదో నిర్ణయించుకుంటారని, ఒకవేళ శక్తిసామర్థ్యాలు లేకుంటే మరో కోర్సులో చేరతారన్నది నిపుణుల అభిప్రాయం. దాంతో ఈ దిశగా కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది.
మరిన్ని కోర్సులకు?
మొదట ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులకు ఆప్టిట్యూడ్ పరీక్ష వర్తింపజేసినా తర్వాత పలు కోర్సులకు కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నిపుణుల వ్యాఖ్య చాలా అవసరం
‘‘ఇలాంటి పరీక్ష ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా అవసరం. ప్రస్తుతం ఎంతోమంది ఆసక్తి లేకున్నా.. అందరూ ఇంజినీరింగ్‌లో చేరుతున్నారని చేరేవాళ్ల శాతం తక్కువేమీ కాదు’’
కథనాలు
దేవతార్చన

- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
- వైద్యానికి డబ్బుల్లేక భార్య సజీవ ఖననం