close
ఎలుబాక నుంచే ఏరువాక?

ఆధారాలున్నాయంటున్న పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: నాగలి కట్టి దుక్కి దున్నే ఏరువాక వచ్చేసింది. నేడు ఏరువాక పౌర్ణమి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఏరువాక ఎక్కడ ప్రారంభమైంది అనే అంశంపై భిన్నవాదనలున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక మండలం మానేరు నదీ తీరాన వెలిసిన ఎలుబాక గ్రామం నుంచే ఏరువాక వచ్చిందంటున్నారు.. పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి. ఈ గ్రామం పేరుతో పాటు అక్కడ ఉన్న పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లభించిన ఆధారాలు ఎలుబాకలోనే ఏరువాక పుట్టినట్లు రుజువు చేస్తున్నాయని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక్కడి ఒక రాయిపై అద్భుతంగా చెక్కిన నాగలి శిల్పం ఉంది. వీటితో పాటు ఆ గ్రామంలోని పోచమ్మ ఆలయంలో.. నాగలి అర్థం పేరుతో ఉన్న సమీప గ్రామాలు.. ఆ పల్లెల్లో ఉన్న కాకతీయుల కాలంనాటి ఆలయాలు వంటి మరికొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.