close
ఆ నీటితో పాదరసం స్థాయులు పైపైకి!

బొగ్గు విద్యుత్తు కేంద్రాలతో నీటి వనరులు కలుషితం

ఈనాడు, సంగారెడ్డి: కలుషిత జలాల్లో పెరిగిన చేపలను, ఆ నీటితో పండించిన బియ్యాన్ని తింటే మానవుల శరీరంలో పాదరసం స్థాయులు పెరుగుతున్నట్లు హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు స్పష్టం చేశారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆ వివరాలను వెల్లడించారు. తమ పరిశోధనలో భాగంగా హైదరాబాద్‌, గోవాలోని వాస్కోడగామా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరాల్లో నివసిస్తున్న 600 మంది నుంచి నమూనాలు సేకరించామన్నారు. వారి శరీరంలో పాదరసం స్థాయులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా తల వెంట్రుకలను తీసుకొని విశ్లేషించారు. సాధారణంగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు పాదరసాన్ని పర్యావరణంలోకి ఎక్కువగా విడుదల చేస్తుంటాయి. హైదరాబాద్‌,  వాస్కోడగామాలలో ఈ కేంద్రాలు లేవు. నెల్లూరులో ఉన్నాయి. అక్కడి నీటి వనరుల్లోకి పాదరసం చేరి, జలాలు కలుషితం అయ్యాయి. వాటిలో పెరిగిన చేపలను ఆహారంగా తీసుకోవడంతో కొందరిలో పాదరసం స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. పరిశోధనలో భాగంగా పరీక్షించిన 5.5% మందిలో నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల మనుషుల్లో నాడీ సంబంధిత వ్యాధులు రావడంతోపాటు మూత్రపిండాలు, ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లోని సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సహ ఆచార్యుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఆసిఫ్‌ ఖురేషీ మార్గదర్శకత్వంలో పరిశోధక విద్యార్థిని సుభావనా కటకం ఈ పరిశోధన చేశారు. మనదేశంలో 2020 సంవత్సరం నాటికి పాదరసం ఉద్గారాలు 540 టన్నులకు చేరనున్నట్లు ఖురేషీ వివరించారు. బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాల నుంచి ఉద్గారాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.