close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కృత్రిమ మేధలో ప్రపంచస్థాయి కేంద్రంగా తెలంగాణ

వ్యవసాయంలోనూ డిజిటల్‌ సాంకేతికత
ప్రపంచ ఆర్థిక వేదిక, సీ4ఐఆర్‌
ఇండియా సంస్థల దృశ్యమాధ్యమ సదస్సులో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచస్థాయి కేంద్రంగా తెలంగాణ ఎదుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఐటీ, పరిశ్రమలతో పాటు వ్యవసాయంలోనూ డిజిటల్‌ సాంకేతికత ద్వారా తెలంగాణలో అపార అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక, భారత నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం (సెంటర్‌ ఫర్‌ ది ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌, ఇండియా- సీ4ఐఆర్‌) బుధవారం దిల్లీ నుంచి దృశ్యమాధ్యమంలో నిర్వహించిన వ్యవసాయ ఆవిష్కరణకు కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ ఇన్నొవేషన్స్‌- ఏఐ4ఏఐ) కార్యక్రమాన్ని కేటీఆర్‌ హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఓ సాంకేతిక విప్లవం. దాని ద్వారా అద్భుతాలు చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం 2020ని ఏఐ నామ సంవత్సరంగా ప్రకటించింది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, పలు ప్రసిద్ధ కంపెనీలు, అంకురాలు, పౌరసమాజం భాగస్వామ్యంతో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకు ఉపయోగపడాలన్నది సీఎం కేసీఆర్‌ సంకల్పం. దీనికి అనుగుణంగా పేదల జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నాం. సీ4ఐఆర్‌, ప్రపంచ ఆర్థిక వేదికలతో కలిసి తెలంగాణ ఐటీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం కృత్రిమ మేధ ద్వారా రైతులకు, విధాన రూపకర్తలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపడతాం’’ అని తెలిపారు.
తెలంగాణ చొరవ అభినందనీయం
‘కృత్రిమ మేధ’లో నాయకత్వానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవడం అభినందనీయమని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అన్నారు. ‘‘వ్యవసాయ కార్యక్రమాలలో ఏఐ వినియోగానికి సంబంధించి రాష్ట్రం భాగస్వామి కావడం సంతోషదాయకం’’ అనిఅన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, సీ4ఐఆర్‌ ఇండియా సంస్థల ముఖ్య సలహాదారు జె.సత్యనారాయణ, ప్రపంచ ఆర్థిక వేదిక ఎండీ మురత్‌ సాన్మెజ్‌, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ సాహ్ని, తెలంగాణ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లు ఇందులో పాల్గొన్నారు.
సీఎం సహాయనిధికి స్త్రీనిధి ఉద్యోగుల విరాళం
గ్రామీణాభివృద్ధి శాఖ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 425 మంది స్త్రీనిధి ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విరాళం చెక్కును బుధవారం అందజేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.