close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గిరిజన సంక్షేమానికి సీఎం కృషి

మంత్రి సత్యవతి రాథోడ్‌

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఆదివారం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గిరిజన మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి వీహబ్‌ సంస్థ సీఈవో రావుల దీప్తితో ఈ సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం శుభపరిణామమని మంత్రి అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆధునికీకరించిన ఆదివాసీ మ్యూజియాన్ని మంత్రితో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినా ప్రారంభించారు. తేనె సేకరణలో ప్రమాదాలకు గురికాకుండా ఆదివాసీలకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునేందుకు వీలుగా రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. గిరిజన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టాస్క్‌లో ఉపాధి మార్గదర్శక కేంద్రం ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నైపుణ్య, విజ్ఞాన సంస్థ (టాస్క్‌)లో ఉపాధి మార్గదర్శక కేంద్రాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువతకు ఉద్యోగ, స్వయసమృద్ధి అవకాశాల కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 100 మంది గిరిజన యువతకు ఆంగ్ల భాషలో శిక్షణ, 50 మంది యువతులకు పరిశ్రమల స్థాపనపై శిక్షణ అందిస్తామన్నారు. గ్రామీణ యువతకు స్థానిక ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా మాట్లాడుతూ.. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సహాయక కేంద్రం పనిచేస్తుందని, 040-48488241 నెంబరుకి ఫోన్‌ చేసి నిపుణుల సూచనలు పొందవచ్చన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.