close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంటి నుంచే సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించే కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ(సీఎంఏ) ఫౌండేషన్‌ పరీక్షను అభ్యర్థులు ఇళ్ల నుంచే రాయొచ్చు. పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఐసీఏఐ నిర్ణయం తీసుకుంది. సీఎంఏ కోర్సులో మూడు దశలు ఉండగా అందులో మొదటిది ఫౌండేషన్‌. ఈ పరీక్షను తొలిసారిగా సెప్టెంబరు 6న దేశవ్యాప్తంగా ఇంటి నుంచే (హోం బేస్‌డ్‌) రాసుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. గతంలో దీన్ని నాలుగు రోజులపాటు నిర్వహించేవారు. ఈ సారి ఒక్క రోజు మాత్రమే జరుపుతారు. ఉదయం 10 గంటలకు పేపర్‌-1, మధ్యాహ్నం 2 గంటలకు పేపర్‌-2, 3, 4 ఉంటాయి.

సీఎంఏ  ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలు ఇక డిసెంబరులోనే
మరోవైపు సీఎంఏలో రెండో దశ అయిన ఇంటర్‌, చివరి దశ అయిన ఫైనల్‌ పరీక్షలు జూన్‌లో జరగాల్సి ఉండగా..  సెప్టెంబరులో నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన ఐసీఏఐ తాజాగా ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వాటిని డిసెంబరులో జరిగే పరీక్షల్లో కలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.