close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాక్‌డౌన్‌తో అంతా డౌన్‌

భారత పరిశ్రమల సమాఖ్య విశ్లేషణ

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్పాదక, ఆర్థిక రంగాలపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) స్పష్టం చేసింది. నిబంధనల సడలింపుతో కొంతమేర ఉత్పాదకత పరిస్థితి మెరుగువుతున్నా కార్మికులు కొరత సవాల్‌గా మారిందని జూన్‌ నివేదికలో వెల్లడించింది. లక్షల మంది కార్మికులు సొంతూళ్లకు వెళ్లడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. దేశంపై లాక్‌డౌన్‌ ప్రభావం, ఆన్‌లాక్‌-1 తర్వాత పరిస్థితులను సీఐఐ ఇందులో విశ్లేషించింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలు...ప్రకటించిన కార్యక్రమాలు చూపే ప్రభావాన్ని కూడా అంచనా వేసింది.ఆర్థిక వ్యవహారాలు మేలో పుంజుకోగా జూన్‌లోనూ కొనసాగిందంది.
ముఖ్యాంశాలు..
* అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనాల మేరకు 2020 ప్రథమార్థంలో ఆర్థిక రంగంలో తిరోగమనం అంచనాలకంటే ఎక్కువగా ఉంటుంది. కొలుకోవడానికి ముందు అంచనాలకంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది.
* రవాణా నిబంధనల సడలింపులతో దేశంలో జూన్‌లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి.
* ఎరువుల ఉత్పత్తి మాత్రం వరుసగా రెండో నెల కూడా 7.5 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. స్టీలు, సిమెంట్‌ ఉత్పాదకత తగ్గింది.
* రసాయన ఉత్పత్తులు మినహా ఇతర ఎగుమతుల్లో భారీ తగ్గుదల ఉంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.