close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్లు

17 మంది అధికారుల నియామకం
పల్లె, పట్టణ ప్రగతి సమర్థ అమలే లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిపాలనను బలోపేతం చేయడంతో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం లక్ష్యంగా 17 మంది అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో 8 మంది ఐఏఎస్‌ అధికారులు, 9 మంది స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ జి.రమేష్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో డి.శ్రీనివాసరెడ్డిని నియమించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఐఏఎస్‌లు)
అనుదీప్‌ దురిశెట్టి- భద్రాద్రి-కొత్తగూడెం
కోయ శ్రీహర్ష- జోగులాంబ-గద్వాల
అభిలాష్‌ అభినవ్‌- మహబూబాబాద్‌
బి.సత్యప్రసాద్‌- రాజన్న-సిరిసిల్ల
కుమార్‌ దీపక్‌- పెద్దపల్లి
ఆదర్శ్‌ సురభి- ములుగు
బి.హేమంత్‌సహదేవ్‌రావు- నిర్మల్‌
తేజస్‌ నందాలాల్‌ పవార్‌- మహబూబ్‌నగర్‌
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు)
కోట శ్రీవత్స- వనపర్తి
జె.అరుణశ్రీ- జగిత్యాల
ఎ.నరసింహారెడ్డి- కరీంనగర్‌
కె.చంద్రారెడ్డి- నారాయణ్‌పేట
ఎన్‌.నటరాజ్‌- ఆసిఫాబాద్‌
వై.వి.గణేష్‌- భూపాలపల్లి
బి.వెంకటేశ్వర్లు- మెదక్‌
జి.పద్మజారాణి- సూర్యాపేట

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.