close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
42 అంశాల్లో ముందుంటేనే ఆదర్శ పట్టణం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజలకు మెరుగైన పౌరసేవలు, వారు ఆరోగ్యవంతులుగా ఉండేలా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలనఉండే పట్టణాలనే ఆదర్శ పట్టణాలుగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ఆదర్శ పట్టణాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలను పురపాలకశాఖ స్పష్టం చేసింది. మొత్తం 42 అంశాలను సూచించిన పురపాలకశాఖ వీటన్నింటిని అమలుచేసే పట్టణమే ఆదర్శ పట్టణమవుతుందంది. వాటిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆన్‌లైన్‌ సేవలు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, పట్ణణంలో ప్రత్యేక మౌలిక వసతులు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆదాయ వనరులు, పురపాలకలెక్కల నిర్వహణ, పౌరుల భాగస్వామ్యం వంటివి ఉన్నాయి. వీటిలో ఎన్నింటిని ఆ పురపాలక సంఘం లేదా నగరపాలక సంస్థ సాధించిందనే అంశం ఆధారంగా వాటి పనితీరును అంచనా వేస్తారు.
ఆదర్శపట్టణాలకు ఉండాల్సిన లక్షణాలు
* పురపాలక చట్టంలోని పౌర అధికారపత్రం అమలు
* పౌరసేవా కేంద్రాల ఏర్పాటు
* ఆన్‌లైన్‌ సేవలు...ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు
* బహిరంగ మలవిసర్జన లేని పట్టణం
* నిర్దేశించిన మేర ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం
* శాస్త్రీయపద్ధతిలో సెప్టిక్‌ట్యాంకుల నిర్వహణ
* * వందశాతం తడి, పొడి చెత్తను వేరుచేయడం
* శాస్త్రీయ పద్ధతిలో చెత్త, ఘనవ్యర్థాల నిర్వహణ
* డంప్‌యార్డుల్లో ఇప్పటికే ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ
* ప్లాస్టిక్‌ నియంత్రణ
* నిర్మాణ వ్యర్థాల నిర్వహణ
* ఇంటింటికి వంద శాతం నీటి వసతి
* నీటి సరఫరా ఖర్చులను రాబట్టేలా ఆదాయ, వ్యయాల ప్రణాళిక ...నీటి ఆడిట్‌
* * వీధి దీపాల నిర్వహణ, ఎనర్జీ ఆడిట్‌
* నెలవారీ విద్యుత్‌ఛార్జీలు, బకాయిల చెల్లింపు
* వందశాతం రహదారులు, మురుగునీటి కాలువల నిర్వహణ,
* పార్కులు, క్రీడా ప్రాంగణాలు, ఏకీకృత మార్కెట్లు, ఆధునిక పద్ధతుల్లో జంతువధశాల
* వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్‌ల ఏర్పాటు
* వైకుంఠధామాల ఏర్పాటు
* బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, దోమల నివారణా చర్యలు
* పట్టణంలో 33 శాతం పచ్చదనం
* ఆక్రమణల నుంచి చెరువుల పరిరక్షణ...పారిశ్రామిక వ్యర్థాలు వాటిలో కలవకుండా చర్యలు
* వందశాతం ఆస్తి పన్ను వసూలు, ఆన్‌లైన్‌ అకౌంటింగ్‌ విధానం అమలు.
* పట్టణ క్రెడిట్‌ రేటింగ్‌ పొందడం
* వార్డు కమిటీల ద్వారా పౌరుల భాగస్వామ్యం... మూణ్ణెళ్లకోసారి ఈ కమిటీ సమావేశాల నిర్వహణ.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.