close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహిళలు సమర్థతను చాటుకోవాలి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఈనాడు, హైదరాబాద్‌: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పనిచేసే ప్రతీచోటా గుర్తింపును, సమర్థతను చాటుకోవాలన్నారు. అంతర్జాతీయ వైశ్య సమాఖ్య (ఐవీఎఫ్‌) మహిళా విభాగం ప్రతినిధులు మంగళవారం ఇక్కడ కవితను ఆమె నివాసంలో కలిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. కవిత మాట్లాడుతూ,  సీఎం కేసీఆర్‌ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వపరంగా లభిస్తున్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకోవాలని, స్వయంసమృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు