close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దిగువ పెన్‌గంగ కాల్వ పనులకు అటవీ భూమి

అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

ఈనాడు, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మిస్తున్న దిగువ పెన్‌గంగ అంతర్‌రాష్ట్ర ఎత్తిపోతల పథకం కాల్వ పనులకు 8.78 హెక్టార్ల రక్షిత అటవీ భూమి వినియోగానికి సంబంధించి ప్రభుత్వం స్టేజ్‌-2 అనుమతులకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం నుంచి 5.12 టీఎంసీల నీటిని తరలించనుండగా 19,233 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. రక్షిత అటవీ భూమిని తీసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ అడవిని పెంచేందుకు ఆదిలాబాద్‌ అటవీ డివిజన్‌ బేల మండలం మంగ్రూల్‌ గ్రామ పరిధిలో అంతే భూమిని అటవీశాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు