close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముద్ర రుణాల్లో తెలంగాణపై వివక్ష

కేంద్రానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ముద్ర రుణాల మంజూరులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. జనాభా ప్రాతిపదికన 68 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా.. 40.9 లక్షల మందికే ఇచ్చారని, మిగతా 28 లక్షల మందిని పట్టించుకోలేదన్నారు. ఈ రుణాల మంజూరులో భాజపా పాలిత రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తూ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు మంగళవారం లేఖ రాశారు. ‘దేశ జనాభాలో సగటున 17.86 శాతం మందికి రుణాలివ్వగా, తెలంగాణలో 10.62 శాతం మాత్రమే ఇచ్చారు. ముద్ర పథకంపై విస్తృతంగా ప్రచారం కల్పించి బ్యాంకుల ద్వారా దరఖాస్తులు తీసుకోవాలి. కనీసం రూ. 10 లక్షల రుణాలివ్వాలన్న ప్రాథమిక నిబంధనను అమలు చేయాలి’ అని వినోద్‌ డిమాండ్‌ చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు