close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అసెంబ్లీ రద్దుపై వ్యాజ్యం కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీని 2018లో రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46, తదనంతర నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ సుదర్శన్‌ మరో నలుగురు నిరుద్యోగులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ ఇందులో రాజ్యాంగ అంశాలున్నాయని, వాటిని తేల్చాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. సభలో సభ్యులు కాని వ్యక్తులు, ఎవరో వేసిన పిటిషన్‌లను తేల్చలేమంది. 

ఎమ్మెల్యే సైదిరెడ్డిపై హైకోర్టులో పిటిషన్‌
హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే  సైదిరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు తప్పుగా ఇచ్చారని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆయనపై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతిరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఉపఎన్నిక సందర్భంగా సైదిరెడ్డి తన అఫిడవిట్‌లో ఆస్తులను తప్పుగా పొందుపరచడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, ఆయన ఎన్నిక చెల్లదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై తనకు నోటీసు అందిందని, కోర్టులోనే తేల్చుకుంటానని ఎమ్మెల్యే సైదిరెడ్డి చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు