close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తాం

మంత్రి సత్యవతి రాథోడ్‌ హామీ

ఈనాడు, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ‘ప్రత్యేకాభిమానంతో సీఎం కేసీఆర్‌ ఇప్పటికే మీకు రెండుసార్లు వేతనాలు పెంచారు. పలు సౌకర్యాలు కల్పించార’ని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకురాళ్ల సంఘం అధ్యక్షురాలు భిక్షమమ్మ ఆధ్వర్యంలో ప్రతినిధులు నిర్మల, సౌజన్య, ఉమాదేవి, రాజమణి.. మంత్రిని కలిసి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆరోగ్యకార్డులు, జీవిత బీమా,  పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని, వేతనాలు పెంచాలని, తమను క్రమబద్ధీకరించాలని కోరారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు