close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తూర్పు గాలులతో పొడివాతావరణం

ఈనాడు, హైదరాబాద్‌ : తూర్పు భారతం నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో పగలు పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణంకన్నా 17 శాతం వరకూ అదనంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ అదనంగా నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత అర్లి (ఆదిలాబాద్‌ జిల్లా), పిట్లం (కామారెడ్డి)లో 15.8, హైదరాబాద్‌ నగర శివారు భాగ్యనగర్‌ నందనవనంలో 16.4 డిగ్రీలుంది. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పగటి వేళ క్రమేణా వేసవి వాతావరణం కనిపిస్తోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు