close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జలమండలి మేనేజర్ల కొలువులకు మౌఖిక పరీక్షలు 4 నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జలమండలిలో మేనేజర్‌ పోస్టుల రాతపరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఈ నెల 4 నుంచి 10 వరకు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో మౌఖిక పరీక్షలు జరపనున్నారు. అభ్యర్థుల వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్లో ఉంచినట్లు ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు.
వెబ్‌ ఆప్షన్ల మార్పునకు అవకాశం: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో స్టాఫ్‌ నర్సు కొలువుల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు ఈ నెల 6, 7 తేదీల్లో అవకాశం ఇస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు