close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘సెట్‌’ల ఆలస్య రుసుం 50 శాతం తగ్గింపు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆలస్యంగా దరఖాస్తు చేసే విద్యార్థులకు ఊరటనిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కుటుంబాల ఆదాయం భారీగా తగ్గినందున విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఆలస్య రుసుమును 50 శాతానికి కుదిస్తున్నారు. బుధవారం జరిగే ఐసెట్‌ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఎంసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌, పీజీఈసెట్‌, ఈసెట్‌లకూ 50 శాతం తగ్గింపు నిష్పత్తిని అమలు చేస్తారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు