close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఆందోళన

విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ ఆందోళన కార్యక్రమాలను ఆపేది లేదని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం-327, తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ 2871 పేర్కొన్నాయి. మంగళవారం హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో యూనియన్‌ నేతలు మాట్లాడారు. ఒప్పంద కార్మికుల సేవలను క్రమబద్ధీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినా యాజమాన్యం పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. ఈ నెల 5న వరంగల్‌లో, 8న వివిధ జెన్‌కోల వద్ద, 18న రాష్ట్రస్థాయిలో విద్యుత్‌ సౌధ వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ శ్రీధర్‌, సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు ప్రభాకర్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.నాగరాజు, భూపాల్‌రెడ్డి, తులసిరెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు