close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సైబర్‌ దాడుల నుంచి రక్షణకు ట్రాన్స్‌కో అప్రమత్తం

ఈనాడు, హైదరాబాద్‌: చైనా కేంద్రంగా పనిచేసే ప్రమాదకర కమాండ్‌ కంట్రోల్‌ సర్వర్లు తెలంగాణ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ)లోకి చొచ్చుకువచ్చి ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌టీ-ఐఎన్‌) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌ ట్రాన్స్‌కో అప్రమత్తమైనట్లు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. ‘‘లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నుంచి వివిధ జిల్లాలకు రిమోట్‌ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు సీఈఆర్‌టీ సూచించిన విధంగా సర్వర్‌ ఐపీలను బ్లాక్‌ చేశాం. లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ వెబ్‌సైట్‌ ‘యూజర్‌ యాక్సెస్‌’లో మార్పుచేశాం. గ్రిడ్‌ భద్రతతోపాటు, వినియోగదారులకు విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాం. ఆందోళన అవసరంలేదు’’ అని సీఎండీ చెప్పారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు