
ప్రధానాంశాలు
పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలి ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం నుంచి ప్రతిరోజూ విధులకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గత సెప్టెంబరు నెలాఖరు నుంచి ఇప్పటివరకు వారు ఒక రోజు ఇంటి నుంచి, మరో రోజు బడులకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం 6, 7, 8 తరగతులకూ ప్రత్యక్ష పాఠాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాలని.. అందుకు ఆర్జేడీలు, డీఈఓలు చర్యలు తీసుకోవాలని సంచాలకురాలు ఆదేశించారు. అవసరమైన చోట ఎస్జీటీలను కూడా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పాఠాలు బోధించేలా వినియోగించుకోవచ్చని డీఈఓలకు సూచించారు. కాగా, ఇదే అంశంపై రెండు రోజుల ముందే మెదక్ తదితర జిల్లాల్లో డీఈఓలు తమ కిందిస్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశాల మేరకు అని పేర్కొంటూ ఆదేశాలివ్వడం గమనార్హం.ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతిరోజూ బడులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం మంచి పరిణామమని ఎస్జీటీ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఖామ్రోద్దీన్ పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘వీరూ భాయ్.. నా జీతం పెంచండి’
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
- కాష్ఠం.. కష్టం
- ‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’
- తిప్పతీగ.. కరోనాకు దివ్యౌషధం!
- ఒంటిని పట్టి... మనసును మెలిపెట్టి!
- Corona: 3లక్షలు దాటిన కొత్త కేసులు
- పెళ్లి చూపులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
- దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం