
ప్రధానాంశాలు
ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్య
ఉండవల్లి, న్యూస్‌టుడే: ‘అవతల వాళ్లు చేసే దుష్ప్రచారంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకో రకంగా నిర్ణయం తీసుకుంటే తదుపరి ప్రభుత్వ నిర్ణయాలకు మనమే బాధ్యులమవుతాం. అటువంటి పొరపాట్లు జరగకూడదని నేను ముందే వినయంగా, సుకుమారంగా హెచ్చరిస్తున్నా. తెరాస ప్రభుత్వం ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది. దయచేసి దృష్టిలో పెట్టుకోమని కోరుతున్నా’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ మరుగున పడిందన్నారు. అలాంటి పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపిస్తే ఏం న్యాయం జరుగుతుందో పట్టభద్రులు, ఉద్యోగులు ఆలోచించాలన్నారు. మరో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెరాసతో పేగుబంధం ఉందని, ఆ బంధాన్ని తెంచుకోవద్దని కోరారు. వాణీదేవిని గెలిపిస్తే సమస్యల పరిష్కారం సులభం అవుతుందన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘వీరూ భాయ్.. నా జీతం పెంచండి’
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
- కాష్ఠం.. కష్టం
- ‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’
- తిప్పతీగ.. కరోనాకు దివ్యౌషధం!
- ఒంటిని పట్టి... మనసును మెలిపెట్టి!
- Corona: 3లక్షలు దాటిన కొత్త కేసులు
- పెళ్లి చూపులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
- దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం