close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తుది తీర్పునకు లోబడే గురుకులప్రిన్సిపాళ్ల నియామకం: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్ల పోస్టుల భర్తీ ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. నియామకాలకు సంబంధించి 4 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తమకంటే తక్కువ ప్రతిభ ఉన్నవారిని నియమించారంటూ టీఎస్‌పీఎస్సీని సవాలు చేస్తూ టి.భానుప్రియ మరో 12 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ మూడు దశల్లో వెరిఫికేషన్‌ చేసి, చివరికి తక్కువ అర్హత ఉన్నవారిని నియమించారన్నారు. దీనిపై ఏఏజీ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ అర్హతలతోపాటు అనుభవం ఉన్న ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం కల్పించామని చెప్పారు. ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తరువాత ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా వాటిని పరిగణనలోకి తీసుకోలేమని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి టీఎస్‌పీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు